ఉత్తర ఒరిస్సా ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం

  7.6 కి.మీల ఎత్తులో ఉపరితల ఆవర్తనం 48 గంటల్లో మరింత తీవ్రంగా మారే అవకాశం నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు హైదరాబాద్ : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం (ఆగష్టు 13వ తేదీన) ఉదయం గాంగేటిక్ పశ్చిమబెంగాల్ ఆనుకొని ఉన్న ఉత్తర ఒరిస్సా ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. రాగల 48 […] The post ఉత్తర ఒరిస్సా ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

7.6 కి.మీల ఎత్తులో ఉపరితల ఆవర్తనం
48 గంటల్లో మరింత తీవ్రంగా మారే అవకాశం
నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

హైదరాబాద్ : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం (ఆగష్టు 13వ తేదీన) ఉదయం గాంగేటిక్ పశ్చిమబెంగాల్ ఆనుకొని ఉన్న ఉత్తర ఒరిస్సా ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. రాగల 48 గంటల్లో మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

మంగళవారం రాత్రి, బుధవారం (ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో) ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని, మంగళవారం రాత్రి, బుధవారం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Low pressure in the Northwest Bay of Bengal

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఉత్తర ఒరిస్సా ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: