ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

నల్లగొండ : ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నేరేడుగొమ్ము మండ లం బచ్చాపురానికి చెందిన మైనర్ బాలిక గతంలో తన కుటుంబ సభ్యులతో కలిసి కూలీ పని నిమిత్తం హైదరాబాద్ నగరంలోని చంపాపేట్‌లో ఉంటున్న సమయంలో సతీష్‌కుమార్ అనే యువకుడితో ప్రేమలో పడింది. పెద్దలు ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తమ కుటుంబ సభ్యులకు చెప్పకుండా ప్రేమ జంట గత నెల […] The post ప్రేమజంట ఆత్మహత్యాయత్నం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నల్లగొండ : ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నేరేడుగొమ్ము మండ లం బచ్చాపురానికి చెందిన మైనర్ బాలిక గతంలో తన కుటుంబ సభ్యులతో కలిసి కూలీ పని నిమిత్తం హైదరాబాద్ నగరంలోని చంపాపేట్‌లో ఉంటున్న సమయంలో సతీష్‌కుమార్ అనే యువకుడితో ప్రేమలో పడింది. పెద్దలు ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తమ కుటుంబ సభ్యులకు చెప్పకుండా ప్రేమ జంట గత నెల ఇంట్లో నుంచి పారిపోయి హైదరాబాద్‌లోని బొల్లారంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు. నెల రోజులుగా మైనర్ బాలిక ఆచూకీ లభించకపోవడంతో బాలిక కుటుంబ సభ్యులు నేరేడుగొమ్ము పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల శనివారం ప్రేమ జంటను అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ కోసం పోలీస్టేషన్‌కు రప్పించారు.

బాలతిక మైనర్ కావడంతో వివాహం చేయలేమని పోలీసులు తెలిపారు. దీంతో ప్రేమికుడు సతీష్ పోలీస్టేషన్ సమీపంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై గాయాలపాలయ్యాడు. తన ప్రేమికుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడని ఆందోళనకు గురైన ఆ బాలిక పోలీస్టేషన్ భవనంపైకి ఎక్కి కిందకు దూకింది. ఈ సంఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. గతంలో సతీష్ మైనర్ బాలికను వివాహం చేసుకుంటానని తీసుకెళ్లడంతో అతనిపై కేసు నమోదు అయినట్లు ఎస్‌ఐ పరమేష్ పేర్కొన్నాడు. ఆత్మహత్యకు యత్నించిన ఇద్దరినీ దేవరకొండ పట్టణంలోని సాయి సంజీవని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా సతీష్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

Lovers Suicide Attempt in Nalgonda District

The post ప్రేమజంట ఆత్మహత్యాయత్నం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: