ఉరివేసుకుని ప్రేమజంట ఆత్మహత్య

రామాయంపేట : కులాంతర వివాహానికి పెద్దలు అంగీకరంచరేమోనని ఓప్రేమ జంట ఒకే చెట్టుకు ఉరివేసుకుని తనువులు చాలించిన ఘటన రామాయంపేట మండలం ఝాన్సిలింగాపూర్‌లో ఆదివారం నాడు చోటు చేసుకుంది.స్తానిక పోలీసుల,మృతుల కుటుంబీకుల వివరాల ప్రకారం రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామానికి చెందిన పర్వీనా(19) పట్టణంలో కుట్టు మిషన్‌లో శిక్షణ తీసుకుంటుంది.అలాగె ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన నల్ల బాలేష్(21) పట్టణంలోని ఓకిరాణా దుకానంలో పనిచేస్తున్నాడు.కాగా వీరి ఇరువురి మద్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.గత కొంత కాలంగా వీరు […]

రామాయంపేట : కులాంతర వివాహానికి పెద్దలు అంగీకరంచరేమోనని ఓప్రేమ జంట ఒకే చెట్టుకు ఉరివేసుకుని తనువులు చాలించిన ఘటన రామాయంపేట మండలం ఝాన్సిలింగాపూర్‌లో ఆదివారం నాడు చోటు చేసుకుంది.స్తానిక పోలీసుల,మృతుల కుటుంబీకుల వివరాల ప్రకారం రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామానికి చెందిన పర్వీనా(19) పట్టణంలో కుట్టు మిషన్‌లో శిక్షణ తీసుకుంటుంది.అలాగె ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన నల్ల బాలేష్(21) పట్టణంలోని ఓకిరాణా దుకానంలో పనిచేస్తున్నాడు.కాగా వీరి ఇరువురి మద్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.గత కొంత కాలంగా వీరు ప్రేమించుకుంటుండగా ఇట్టి విషయం బాలేష్ ఇంట్లో ఇటీవల తెలిసింది.దీంతో అతన్ని పనుల నుంచి మాన్పించారు.ఈక్రమంలోనే మనస్తాపం చెందిన వారు శనివారం నాడు ఇరువురు ఝాన్సీలింగాపూర్ శివారులోని అటవీ ప్రాంతంలోకి వెల్లి ఒకే చెట్టుకు చున్నీతో ఉరి వేసుకుని మృతి చెందారు.అయితె ఆదివారం ఉదయం వరకు అతను కానరాక పోవడంతో కుటుంబీకులు వెతకడం ప్రారంభించారు.ఈక్రమంలో అటవీ ప్రాంతంలో ఇరువురు ఓచెట్టుకు ఉరివేసుకుని మృతి చెందిన విషయాన్ని గమనించారు.ఈమేరకు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ మహేందర్ అక్కడికి చెరుకుని వివరాల అడిగి తెల్సుకున్నారు.పంచనామా అనంతరం శవాలు పోస్టు మార్టన్ నిమిత్తం పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబీకుల పిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.కాగా ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడటంతో ఇరు గ్రామాల్లో విషాద చాయలు అలుముకున్నాయి.
ఫోటో17ఎండిఆర్‌పిటిపి1-చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందిన ప్రేమ జంట
ఫోటో17ఎండిఆర్‌పిటిపి2,3 మృతుల ఫైల్‌ఫోటోలు

Lovers Commits Suicide In Medak District

Related Stories: