రాంపూర్‌లో ప్రేమజంట బలవన్మరణం…

lovers-suicideమహబూబ్‌నగర్: జిల్లాలోని కోయిల్‌కొండ మండలం రాంపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమజంట రాంపూర్ శివారులో గుట్టపై చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పెద్దలు తమ ప్రేమను అంగీకరించకపోవడంతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.

కాగా, యువతి, యువకుడి ఆదృశ్యంపై 3 నెలల కిందట తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గుట్టపై చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను గొర్రెల కాపరులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రేమజంట ఇంటి నుంచి వెళ్లిన మార్చి 23వ తేదీనే ఉరివేసుకున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Lovers commits suicide in Mahabubnagar

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రాంపూర్‌లో ప్రేమజంట బలవన్మరణం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.