ప్రియురాలి ప్రేమ కోసం ప్రియుడు కిడ్నాప్ డ్రామా

 

లక్నో: ప్రియురాలి ప్రేమ కోసం ప్రియుడు కిడ్నాప్ డ్రామా ఆడి అరెస్టైన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కుచ్ జిల్లా భుజ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మెహుల్ జోషి (23) అనే యువకుడు, ఇషా పచేల్(18) అనే అమ్మాయి గాఢంగా ప్రేమించుకున్నారు. తన లవర్‌కు తనపై ఎంతో ప్రేమ ఉండో తెలుసుకోవడానికి కిడ్నాప్ డ్రామా ఆడాడు. జోషి ఆఫీస్ నేరుగా ఇంటికి రాకుండా గాంధీధామ్ ప్రాంతంలోని గెస్ట్ హౌజ్ కు వెళ్లాడు. అనంతర తన ఫోన్‌లో ఉన్న సిమ్‌ను తీసేసి మరో సిమ్ ను ఫోన్‌లో వేశాడు. అనంతరం తన ప్రియురాలికి గొంతు మార్చి ఫోన్ చేశాడు. జోషిని కిడ్నాప్ చేశామని మూడు లక్షల రూపాయలు తీసుకొని వస్తే ప్రాణాలతో వదిలిపెడుతామని లేకపోతే చంపేస్తామని బెదిరించాడు. దీంతో ఇషా భయపడి భుజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ ప్రజాపతి తన సిబ్బందితో కలిసి మొబైల్ ఉన్న లోకేషన్ చేరుకొని ట్రేస్ చేశాడు. గాంధీధామ్‌లోని బస్టాండ్ సమీపంలో గల గెస్ట్ హౌజ్‌లో మొబైల్ లోకేషన్ ఉన్నట్టు గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడికే చేరుకునే సరికి జోషి ఒక్కడే కనిపించాడు. ఎవరు కిడ్నాప్ చేశారని ప్రశ్నించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. పోలీసులు తప్పుదారి పట్టించునందుకు అతడిపై ఐపిసి 182 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

 

Lover Kidnapping Drama for Girl Friend’s Love in UP

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రియురాలి ప్రేమ కోసం ప్రియుడు కిడ్నాప్ డ్రామా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.