‘లవ్ స్టోరీ’ ఫస్ట్ లుక్ విడుదల

Love Story

 

హైదరాబాద్ : నాగ చైతన్య, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తోన్న సినిమా ‘లవ్ స్టోరీ’. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. తెలంగాణ నేపథ్యంలో రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు శేఖర్ కమ్ముల. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. సాయిపల్లవి, చైతూ ఎమోషనల్ సన్నివేశంలో ఉన్నట్లుగా కనిపిస్తున్న పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తన ప్రతీ సినిమాలోను తెలంగాణ యాస, భాషకు ప్రాధాన్యమిస్తూ కీలకమైన పాత్రను పెడుతుంటాడు శేఖర్ కమ్ముల.

Love Story First Look Release

The post ‘లవ్ స్టోరీ’ ఫస్ట్ లుక్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.