ప్రేమజంట ఆత్మహత్య

రంగారెడ్డి : తలకొండపల్లి మండలంలోని వెంకటాపూర్‌ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ  ప్రేమజంట పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన తాండ్ర మల్లేశ్‌(19), అదే గ్రామానికి చెందిన శిల్ప(17) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమకు పెళ్లి  చేయాలని వారు ఇరు కుటుంబాలను కోరారు. అయితే ఇరు కుటుంబాల వారు వీరి  పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన మల్లేశ్, శిల్ప  బుధవారం రాత్రి ఇంట్లో నుంచి పారిపోయారు. గ్రామ శివారులో ఉన్న పొలంలో […] The post ప్రేమజంట ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రంగారెడ్డి : తలకొండపల్లి మండలంలోని వెంకటాపూర్‌ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ  ప్రేమజంట పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన తాండ్ర మల్లేశ్‌(19), అదే గ్రామానికి చెందిన శిల్ప(17) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమకు పెళ్లి  చేయాలని వారు ఇరు కుటుంబాలను కోరారు. అయితే ఇరు కుటుంబాల వారు వీరి  పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన మల్లేశ్, శిల్ప  బుధవారం రాత్రి ఇంట్లో నుంచి పారిపోయారు. గ్రామ శివారులో ఉన్న పొలంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం మల్లేశ్, శిల్పల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Love Couple Suicide at Rangareddy on Wednesday Night

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రేమజంట ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: