నగరూరులో ప్రేమ జంట ఆత్మహత్య

Love Coupleఅనంతపురం : యాడికి మండలం నగరూరులో విషాదం  చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లికి  పెద్దలు అంగీకరించలేదన్న మనస్తాపంతో ఓ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.  నగరూరుకు చెందిన  వినోద్, సుచరిత  కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని వీరు నిర్ణయించుకున్నారు. అయితే వీరి ప్రేమ పెళ్లిని ఇరు కుటుంబాల పెద్దలు వ్యతిరేకించారు. దీంతో మనస్తాపానికి గురైన ఈ ప్రేమ జంట శనివారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. శవ పరీక్ష కోసం వినోద్, సుచరిత మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Love Couple Committed Suicide In Nagaruru

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నగరూరులో ప్రేమ జంట ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.