కాలం చెల్లిన పురుగు మందుల అమ్మకాలు

 Pesticides

 

తూప్రాన్‌ : తూప్రాన్ మండలంలోని పలు గ్రామాల రైతులకు ఫర్టిలైజర్ వ్యాపారులు నకిలీ దిగిపోయిన పురుగుల మందులు అమ్మి అమాయక రైతులను నిలువునా ముంచుతున్నారు. ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు రైతులకు ప్రవేశపెట్టి రైతులకు అండగా ఉంటే దళారులు ఫర్టిలైజర్ వ్యాపారులు నాసిరకమైన విత్తనాలు, క్రిమిసంహారక మందులు అమ్మి రైతులను బ్రతికున్న శవాలుగా మారుస్తున్నారు. తూప్రాన్ మండలం కోనాయిపల్లి(పిబి) గ్రామానికి చెందిన నిరుపేద రైతు సంగుపల్లి రాములు వ్యవసాయానికి 50వేల రూపాయలు అప్పుచేసి తనకున్న ఎకరన్నర భూమిలో మొక్కజొన్న పంట వేశాడు.

మొక్కజొన్నకు మొగిపురుగు తగిలిందని తూప్రాన్‌లోని రెడ్డి ఫర్టిలైజర్‌షాపుకు వచ్చి మొక్కజొన్నకు మొగిపురుగు కొట్టే అగ్గిమందు ఇవ్వమని రైతుఅడుగగా ఫర్టిలైజర్ యజమాని నర్సింహరెడ్డి అగ్నిమందు కంటే మంచిగా పనిచేసే మందు ఇస్తున్నానని రైతుకు విక్రయించాడు. రైతు ఆ మందులు మొక్కజొన్నకు వేస్తుండగా రైతు కళ్లల్లో మంటలు, నీళ్లు రావడం, కాళ్లకు మంటలు, బొబ్బలు వచ్చాయి.ఖరీదైన మందు కదా మందులో పవర్ ఎక్కువగా ఉంది అనుకున్నాడు ఆ రైతు. మరుసటి రోజు పంటను చూసేసరికి రైతు కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

కాలం చెల్లిన మందులు వేసేసరికి పంట పూర్తిగా మాడిపోయింది. మొగిపురుగు పోతుందని అనుకున్న రైతు పంట ఎండిపోయిందని లబోదిబోమంటూ రెడ్డి ఫర్టిలైజర్ షాపు వద్దకు మందుల డబ్బాలు ఎండిపోయిన మొక్కజొన్న కర్రలతో వచ్చి యజమానికి తెలిపాడు. ఫర్టిలైజర్ యజమాని అవును అమ్మినానుఅయిపోయింది. దానికి నేను ఏం చేయను అని రైతును బెదిరించాడు. రైతు రాములు చేసేది ఏమిలేక షాపు ముందు నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చొని ఆలోచిస్తూ తన ఊరి సర్పంచ్‌కు ఫోన్‌ద్వారా సమాచారం అందించడంతో సర్పంచ్ కంకణాల పాండు కోనాయిపల్లి రైతులు అందరితో వచ్చి రెడ్డి ఫర్టిలైజర్ ముందు ఆందోళన చేపట్టి రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Losses to Farmers with outdated Pesticides

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కాలం చెల్లిన పురుగు మందుల అమ్మకాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.