దేశాన్ని పాలించేది ప్రాంతీయ పార్టీలే

లోక్‌సభలో 250-260 సీట్లు గెలిచే సత్తా ప్రాంతీయ పార్టీలకుంది దేశంలో గరీబులు ఇంకెంతకాలం ఉండాలి ? దీనిని బట్టి దేశ పరిస్థితులపై జాతీయ పార్టీల అవగాహనేమిటో తెలుస్తోంది దారిద్య్రానికి, నీటి ఎద్దడికి ఆ రెండు పార్టీలే కారణం ఈ ఎన్నికలు దేశ భవిషత్తును, గతిని, గమనాన్ని నిర్దేశిస్తాయి – ఖమ్మం, మహబూబాబాద్ భారీ బహిరంగ సభల్లో కెసిఆర్ కాంగ్రెస్, బిజెపి కలిసినా అధికారంలోకి రాలేవు   మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్, బిజెపి పార్టీలు కలిసినా పార్లమెంట్ ఎన్నికల్లో […] The post దేశాన్ని పాలించేది ప్రాంతీయ పార్టీలే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లోక్‌సభలో 250-260 సీట్లు గెలిచే సత్తా ప్రాంతీయ పార్టీలకుంది
దేశంలో గరీబులు ఇంకెంతకాలం ఉండాలి ?
దీనిని బట్టి దేశ పరిస్థితులపై జాతీయ పార్టీల అవగాహనేమిటో తెలుస్తోంది
దారిద్య్రానికి, నీటి ఎద్దడికి ఆ రెండు పార్టీలే కారణం
ఈ ఎన్నికలు దేశ భవిషత్తును, గతిని, గమనాన్ని నిర్దేశిస్తాయి
– ఖమ్మం, మహబూబాబాద్ భారీ బహిరంగ సభల్లో కెసిఆర్

కాంగ్రెస్, బిజెపి కలిసినా అధికారంలోకి రాలేవు

 

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్, బిజెపి పార్టీలు కలిసినా పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజార్టీ రాదని కెసిఆర్ ఆరోపించారు. అన్ని సర్వేలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయన్నారు. ప్రాంతీయ పార్టీలే 250 నుంచి 260 సీట్లు గెలిచే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజల దీవెనతో 16 ఎంపి స్థానాలను గెలుచుకొని దేశ రాజకీయాల్లో టిఆర్‌ఎస్ కీలకం అవుతుందన్నారు. ఇప్పుడు జరుగుతుంది పార్లమెంట్ ఎన్నికలని, ఈ ఎన్నికలు దేశ భవిష్యత్‌ను, గతిని, గమనాన్ని నిర్ధేశిస్తాయని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం బహిరంగ సభలో కెసిఆర్ ప్రసంగించారు. దానికి ప్రజల దీవెన అవసరమన్నారు. మహాత్మాగాంధీ ప్రేరణ మేరకు 1947లో జవహర్‌లాల్ నెహ్రూ దరిద్రో నారాయణ అన్న స్లోగన్‌ను దేశవ్యాప్తంగా తెరమీదకు తీసుకొచ్చారన్నారన్నారు. ఆ తరువాత ఇందిరాగాంధీ గరీభ్ హ టావో అన్నారని, ఆ తరువాత రాజీవ్‌గాంధీ పేదరిక నిర్మూలన అన్న నినాదంతో ముందుకెళ్లారన్నారు.

అనంతరం పివి నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌లతో పాటు చాలామంది ప్రధానులు ఇలాంటి ఎన్నో విషయాలను చాలా చెప్పారని అవి అమలుకు కాలేదన్నారు. మళ్లీ మూడో జనరేషన్ వ్యక్తి అయిన రాహుల్‌గాంధీ, ఆయన నాయనమ్మ పాడిన పాత పాట, గరీబ్ హటావోను తెరపైకి తీసుకొచ్చారని కెసిఆర్ ఆరోపించారు. ఎప్పటిదాకా గరీబ్‌లు ఉంటారని, దేశం మీద వీరికి అవగాహన ఎంత ఉందో తెలుస్తుందన్నారు. వీళ్లకు నిజమైన చిత్తశుద్ధి లేదన్నారు. కాంగ్రెస్, బిజెపిలు ఒకరినొకరు నిందించుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. దేశాన్ని పరిపాలించింది 66 ఏళ్లు పాలించింది ఈ రెండు పార్టీలే అన్నారు. దేశంలో దరిద్రానికి, సాగునీటి, తాగునీటి ఎద్దడికి ఈ రెండు పార్టీలే కారణమన్నారు. సగం దేశం కరెంట్ లేకపోవడానికి ఈ రెండు పార్టీలే తీసుకున్న నిర్ణయాలేనని ఆయన ఆరోపించారు. వేరే ఎవరూ ఈ దేశాన్ని పాలించలేదని వీరు  గగ్గోలు పెట్టడం కరెక్ట్ కాదన్నారు. దీనిపై ప్రజలు కూడా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశ గతి, దిశ, గమనాన్ని మార్చాలంటే తెలంగాణ నుంచి మనం వైతాళికులుగా మారాలని కెసిఆర్ సూచించారు.

ఇక్కడి నుంచి మన ప్రభంజనం దేశాన్ని మలుపు తిప్పేలా ఉండాలన్నారు. మీ బిడ్డగా తాను ఆ బాధ్యతలను సంపూర్ణంగా పోషిస్తానన్నారు. జర్నలిస్టులు తాను చెప్పే విషయాలను కొత్త కోణంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సీతారామ ప్రాజెక్టును ఒకటిన్నర సంవత్సరం లోపు ప్రారంభిస్తామని, దీనికోసం 13 వేల కోట్ల లోన్ తీసుకున్నామని, అన్ని అనుమతులు వచ్చాయని కెసిఆర్ పేర్కొన్నారు. దుమ్ముగూడెం దగ్గర సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్‌ను ప్రారంభిస్తానని, ఇది ప్రారంభ అయిన తరువాత జిల్లాల్లో రెండు పంటలకు నీరు అందుతుందన్నారు. పట్టిసీమ ద్వారా డెల్టా సమస్యను ఆంధ్రా ప్రాంతం వారు ఎలా పరిష్కరించుకున్నారో, మనం నాగార్జున సాగర్ కోసం చూడకుండా సీతారామ ప్రాజెక్టు ద్వారా ఎన్‌హెచ్‌పి ఆయకట్టును కూడా నీరు అందించుకోవాలన్నారు. ఇది ప్రారంభమైతే మూడు పంటలు వేసుకున్న వారికి కూడా నీరు అందుతుందన్నారు. ఒకటిన్నర సంవత్సరంలోనే సీతారామ ప్రాజెక్టును ప్రారంభిస్తానని ఆయన హామినిచ్చారు.

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఈ టర్మ్‌లో సాధించుకుందామని కెసిఆర్ తెలిపారు. కేంద్రం ఇవ్వకుండా మొండి చేస్తే రాష్ట్ర సింగరేణికి అయినా ఈ బాధ్యతను అప్పగించి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించుకుందామన్నారు. ఖమ్మం జిల్లా చాలా చైతన్య వంతమైన పాత్రను పోషిస్తుందని తాను ఆశిస్తున్నానని కెసిఆర్ తెలిపారు. ఈ ప్రాంతం చైతన్య వంతమైనదని, రాజకీయంగా ఇక్కడి ప్రజలకు పరిపూర్ణత ఉందన్నారు. ఎన్నికల తరువాత ఖమ్మం జిల్లాలో రెండు, మూడు రోజులు ఉండి వాటిని పరిష్కరిస్తానన్నారు. అటవీ, పోడు భూములకు సంబంధించి ఏదైనా సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రైతాంగానికి, ప్రజలకు మేలు చేయాలన్న ఉద్ధేశ్యంతో మూడు రోజులు ఈ జిల్లాలో ఉంటానన్నారు. తాను ఒక్కడినే కాకుండా మంత్రివర్గ సభ్యులు, అధికారులు ఖమ్మం జిల్లాకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తారన్నారు. జిల్లాకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలుస్తానని సిఎం పేర్కొన్నారు.

వారి కోరిక మేరకు నీళ్లు విడుదల…

సార్ పంటలు పోయే పరిస్థితి ఉంది, ఈసారి సాగునీరును అందించాలని ఈ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అడిగారని కెసిఆర్ పేర్కొన్నారు. వారి అడిగినందుకు అధికారులు నీళ్లు వదలమని ఆదేశాలు జారీ చేశారన్నారు. మరోసారి పంటలకు నీరు వదలానని వైరా ఎమ్మెల్యే అడిగారని, త్వరలో దానిపై ఆదేశాలు జారీ చేస్తామని కెసిఆర్ తెలిపారు. ఒక్కసారి సీతారామ స్విచ్ ఆన్ అయితే సాగునీటికి ఈ అవస్థ ఉండదన్నారు. ఇక్కడ గ్రానైట్ ఇండస్ట్రీ ఉందని, అది ఎగుడు, దిగుడుల మధ్య కొనసాగుతుందని, దీనిని కూడా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలుసని తాను మరోసారి చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

గుణాత్మకమైన మార్పు రావాలంటే

దేశంలో పవర్‌ను ఎలా వాడుకోవాలనే కాంగ్రెస్, బిజెపిలకు తెలియదన్నారు. ప్రతి రోజు దీనిపై మాట్లాడుతున్నానని, ఏ నాయకుడు కూడా దీనిపై స్పందించడం లేదన్నారు. దేశంలో 70 వేల టిఎంసీల నీరు ఉన్నా దానిని వినియోగించుకోవడం లేదన్నారు. సాగునీటి, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామన్నారు. మళ్లీ ఈ పార్టీలే గెలిస్తే ఇదే వ్యవహారం ఉంటుందని, గుణాత్మకమైన మార్పు రాదని కెసిఆర్ పేర్కొన్నారు. గుణాత్మకమైన మార్పు రావాలంటే బిజెపి, కాంగ్రెస్‌యేతర పార్టీల కూటమి అధికారంలోకి రావాలన్నారు. ఇప్పుడు అవకాశాలు ముమ్మరంగా ఉన్నాయని దానికోసం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ ఎంత ఈజీగా, అలవోకగా అబద్ధాలు మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. పాతాళలోకంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా నల్లడబ్బును బయటకు తీస్తానని గత ఎన్నికల్లో మోడీ వాగ్ధానం చేసి మరిచిపోయారని, దీంతోపాటు ఇంటికి రూ.15 లక్షలు ఇస్తానన్న మాటను కూడా మోడీ విస్మరించారని కెసిఆర్ ఆరోపించారు. అమిత్ షాను ఇదే విషయం అడిగితే ఎన్నికల్లో చాలా చెబుదాం అవన్నీ జరుగుతాయా అని విలేకరులను ఎదురు ప్రశ్న వేశారన్నారు.

విభేదాలను వీడి ఇద్దరూ కలిసిపోవాలి

నామా నాగేశ్వరరావు గతంలో వేరే పార్టీలో ఉన్నా, లోక్‌సభలో ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారని, ప్రత్యేక తెలంగాణ కోసం తాను పోరాడినప్పుడు తనతో పాటు లోక్‌సభలో నామా పోరాడారని కెసిఆర్ గుర్తు చేశారు. రానున్న రోజుల్లో నామా అద్భుతమైన పాత్రను పోషిస్తారని కెసిఆర్ తెలిపారు. తుమ్మలను, పొంగులేటిని తాను కోరేది ఒక్కటేనని, విభేదాలను వీడి వారు కలిసిపోవాలని కెసిఆర్ సూచించారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తాను కావాలని టికెట్ నిరాకరించలేదని, అతను ఇంట్లో మనిషిగా ఉంటారని కెసిఆర్ పేర్కొన్నారు. ఆయనకు కూడా రానున్న రోజుల్లో అద్భుతమైన అవకాశం కల్పిస్తామన్నారు. ఎప్పుడు ఎవరూ ఏమీ అవుతారో, వారికి ఎలా అదృష్టం వరిస్తుందో చెప్పలేమన్నారు.

అందరి అభ్యర్థన మేరకు నామా పేరు…

2001లో తన సహచరులతో రానున్న రోజుల్లో టిఆర్‌ఎస్ పార్టీ పెద్ద పార్టీగా అవతరిస్తుందని చెప్పే వాడినని, ఈ పార్టీ వారు ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు, సిఎంలు, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, విదేశీ రాయబారులు అవుతారని వారితో పేర్కొనేవాడినన్నారు. ఇప్పటికీ అన్ని పదవులను దాదాపు మనపార్టీ అధిగమించారని, గవర్నర్లు, రాయబారులు మాత్రం కాలేదని కెసిఆర్ పేర్కొన్నారు. ఈ టర్మ్‌లో మీ దయతో ఆ పదవులను కూడా టిఆర్‌ఎస్ పార్టీ సాధించుకోబోతుందని కెసిఆర్ పేర్కొన్నారు. అందులో భాగంగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి సేవలను కూడా వాడుకోవాల్సిన అవసరం ఉందని కెసిఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అనేక ఆలోచనలు చేసిన తరువాతే నామా నాగేశ్వరరావు పేరును అందరి కోరిక మేరకు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రతిపాదించడం జరిగిందన్నారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటిలిద్దరూ రాత్రింభవళ్లు శ్రమించి నామాను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నామాను గెలిపించుకొని తుమ్మల, పొంగులేటిలిద్దరూ తన వద్దకు రావాలని, వారి రాజకీయ స్థానం కూడా భద్రంగా ఉంటుందన్నారు.

ఆ పేదల కోసం డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తా

ఖమ్మం పట్టణం ఆంధ్రా ప్రాంతం సరిహద్దుల్లో ఉన్నందున దీనిని చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాలువ గట్టున ఉండే పేదల కోసం వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తామని కెసిఆర్ తెలిపారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సొంత జాగా ఉన్న వారికి డబ్బులు మంజూరు చేస్తామని కెసిఆర్ పేర్కొన్నారు. ఈ రోజు సర్వే ప్రకారం 58 శాతం ఓట్లతో నామా ముందంజలో ఉన్నారని ఇంకా కొంచెం కష్టపడితే 60 శాతం కూడా దాటుతుందని కెసిఆర్ పేర్కొన్నారు. నర్సరీ రైతులకు ఉచిత కరెంట్ ఇస్తానని ఎన్నికల తరువాత దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. భూమి సమస్యలు లేకుండా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకవచ్చి రైతులకు మేలు జరిగేలా చూస్తామన్నారు. ఖమ్మం, పాలేరు, అశ్వారావుపేట, వైరా, మధిర, కొత్తగూడెం, సత్తుపల్లి తదితర నియోజకవర్గాల ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో ఈ సభకు హాజరయ్యారు.

Related Images:

[See image gallery at manatelangana.news]

The post దేశాన్ని పాలించేది ప్రాంతీయ పార్టీలే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: