అర్హులకే అందలం…

  అమలులోకి పంట రుణాల్లో నూతన విధానం పాతకాలం నాటి టైటిల్ డీడ్ పద్ధతులకు స్వస్తి కొత్తగా రైతు, పొలం వివరాల ఆధారంగా రుణం అవకతవకల అడ్డుకట్టకు ప్రభుత్వం తాజా నిర్ణయం నల్లగొండ : ప్రభుత్వ శాఖల్లో అవినీతి కార్యకలాపాలకు చరమగీతం పాడుతూ అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు చర్యలు శ్రీకారం చుడుతోంది. ప్రధానంగా ఖరీఫ్ సీజ న్ నుంచి రైతులకు మేలు చేసే కార్యక్రమాలకు మేలు చేయడంతో పాటు నష్ట నివారణ చర్యలకు […] The post అర్హులకే అందలం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అమలులోకి పంట రుణాల్లో నూతన విధానం
పాతకాలం నాటి టైటిల్ డీడ్ పద్ధతులకు స్వస్తి
కొత్తగా రైతు, పొలం వివరాల ఆధారంగా రుణం
అవకతవకల అడ్డుకట్టకు ప్రభుత్వం తాజా నిర్ణయం

నల్లగొండ : ప్రభుత్వ శాఖల్లో అవినీతి కార్యకలాపాలకు చరమగీతం పాడుతూ అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు చర్యలు శ్రీకారం చుడుతోంది. ప్రధానంగా ఖరీఫ్ సీజ న్ నుంచి రైతులకు మేలు చేసే కార్యక్రమాలకు మేలు చేయడంతో పాటు నష్ట నివారణ చర్యలకు ఉపక్రమిస్తోంది. ప్రధానంగా రైతు పంట రుణాలకు సంబంధించి పలు కీలకమైన మా ర్పులకు శ్రీకారం చుడుతూ సరికొత్త విధానాల అమలుకు రంగం సిద్ధం చేస్తోంది. బోగస్ రుణాలు, నకిలీ పాసుపుస్తకాలు చెల్లకుండా తీసుకున్న నిర్ణయం అన్నదాతలకు మరింత మేలు చేయనుంది.

దుక్కులు దున్నడం, విత్తనాలు, ఎరువుల కొనుగోలు వంటి క్రమంలో అన్నదాతలకు ఆసరాగా నిలవాల్సిన బ్యాంకు రుణాలు ఆశించిన స్థాయిలో అర్హులకు అంద డం లేదన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. సహజంగా రైతు పట్టా పాసుపస్తకాన్ని అనుబంధంగా ఉండే టైటిల్‌డీడ్‌ను తాకట్టు పెట్టుకొని పంట రుణాలు ఇస్తుంటారు. కాగా తాజా గా పాత సంస్కృతికి పాతరేస్తూ రుణాల మం జూరులో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. రెవెన్యూ శాఖలో ఉన్న వెబ్‌ల్యాండ్ ఆధారంగా రైతు వివరాలు, రైతుకు ఎంత పొలం ఉందనే సమాచారం ఆధారంగా బ్యాంకులు రుణాలు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని బ్యాంకులకు ప్రభుత్వం అమలులోకి తీసుకొస్తు న్న సరికొత్త విధానం విషయంలో రెవిన్యూ అ ధికారులు ప్రత్యేకంగా సర్కులర్‌లు కూడా జా రీ చేస్తున్నారు. నల్లగొండ, సూర్యాపేట, యా దాధ్రిభువనగిరి జిల్లాల్లోని రెవెన్యూ అధికారు లు బ్యాంకర్లతో తగు విధంగా చర్చించి అమలు కు సహకరించాలంటూ ప్రభుత్వం ఉద్దేశ్యాన్ని చేరవేస్తున్నారు. రైతుల టైటిల్ డీడ్స్ తీసుకోవద్దని సూచించడమే కాకుండా ఇప్పటికే రైతుల కు సంబంధించి టైటిల్ డీడ్స్ తాకుట్టులో ఉంటే తిరిగి ఇవ్వాలంటూ సూచిస్తున్నారు.

ఈ పద్ధతి ద్వారా పాసు పుస్తకాలు లేని రైతులు ఇక మీద ట ఆన్‌లైన్‌లో పొలాన్ని నమోదు చేసుకుంటే వె బ్‌ల్యాండ్ ఆధారంగా సులువుగా రుణాలు పొ ందే అవకాశాలున్నాయి. మరోవైపు నకిలీ పా సుపుస్తకాలను సృష్టించి రెండు, మూడు బ్యాం కుల్లో రుణాలు తీసుకునే అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకు ఈ విధానం ప్రయోజకనకరం గా ఉంటుంది. దీని ద్వారా ఇటు రైతులకు ఎంతో మేలు చేకూరడంతో పాటు అటు బ్యాం కు అధికారులకు అనవసర శ్రమ తప్పుతుందన్న భావన అధికారుల్లో సంపూర్ణంగా ఉంది.

అవకతవకలకు అస్కారం లేకుండా… రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా వెబ్‌ల్యాండ్ విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ విధానం ఇదివరకే పలు చోట్ల అమలు చేసి చూడడంతో మం చి ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నూతన విధానాన్ని అమలులోకి తీ సుకరావాలని, అందులోనూ అవకతవకలకు ఎలాంటి అస్కారం లేకుండా అమలు చేయవచ్చన్న యోచనలో ఉన్నారు. రైతు పట్టా నంబ ర్, వారి ఆధార్‌కార్డు నెంబర్, భూమి విస్తీర్ణాన్ని ఇందులో నమోదు చేసి పంటల వివరాలు పేర్కొంటారు.

ఏ పంటకు ఎంత రుణం ఇవ్వాలో ప్రభుత్వం ఇది వరకే నిర్ణయించడంతో పాటు వెబ్‌ల్యాండ్‌లో రుణం తీసుకున్న రైతు వివరాలను నమోదు చేసి బ్లాక్ చేయనున్నారు. దీంతో అదే సరేవ నెంబర్‌పై మళ్ళీ వేరే బ్యాంకులో రు ణం తీసుకోవడం కుదరదు. ఒకే రైతుకు వేర్వే రు గ్రామాల్లో పొలాలు ఉంటే పట్టా నంబర్‌లు వేరుగా ఉండడంతో బ్యాంకులో రుణాలు ఆ యా పొలాలపై ఇచ్చినప్పటికి ప్రభుత్వం ద్వా రా వచ్చే రాయితీ మాత్రం ఒకే పట్టానంబర్‌కు వస్తుంది. దీంతో రాయితీ పంపిణీలో అక్రమాలను నిరోధించే అవకాశాలు ఏర్పడ్డాయని రెవిన్యూ అధికారులు అంటున్నారు.

రైతు పంట మేరకు బ్యాంకు రుణాలు… రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ ఏ పంటకు ఎంత రు ణం ఇవ్వాలన్న అంశాన్ని ఖరారు చేస్తూ అన్ని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిం ది. దీంతో రైతులపై పెట్టబడి భారం తగ్గనుంది. ఈ నేపథ్యంలోనే వివిద పంటలు సాగు చేసే రైతాంగానికి గతంలో అందే పంట రుణాల క న్నా అదనంగా రుణాలు అందనున్నాయి. రైతా ంగానికి శాస్త్రీయ పద్ధతిలో రుణాలు అందించే విధానం అమలు చేయడంపై జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Loans based on Farm Details

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అర్హులకే అందలం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: