సింహపు తోక కోతి

రాజేంద్రనగర్ : ప్రపంచలో ఎన్నో రకాల వన్యప్రాణులు ఉన్నాయి. కానీ ఈ ప్రపంచంలో మరెక్కడా లేని ఒక వానరజాతి వన్యప్రాణి సంతతి కేవలం భారతదేశ పశ్చిమ కనుమల పర్వతప్రాంతాల్లో నేటికి కాపురం చేస్తున్నాయి. ఆహార వేటలో, సంచార జీవనంలో అవి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ప్రయాణం సాగించే సమయంలో పర్వత శ్రేణుల రహదారి మార్గం వాటిని ప్రమాదం రూ పంలో బలితీసుకుంటుంది. వాటి పరిరక్షణకు భారత ప్రభుత్వం, అటవీశాఖ ప్రత్యేక స్కైవేల నిర్మాణాలను […] The post సింహపు తోక కోతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రాజేంద్రనగర్ : ప్రపంచలో ఎన్నో రకాల వన్యప్రాణులు ఉన్నాయి. కానీ ఈ ప్రపంచంలో మరెక్కడా లేని ఒక వానరజాతి వన్యప్రాణి సంతతి కేవలం భారతదేశ పశ్చిమ కనుమల పర్వతప్రాంతాల్లో నేటికి కాపురం చేస్తున్నాయి. ఆహార వేటలో, సంచార జీవనంలో అవి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ప్రయాణం సాగించే సమయంలో పర్వత శ్రేణుల రహదారి మార్గం వాటిని ప్రమాదం రూ పంలో బలితీసుకుంటుంది.

వాటి పరిరక్షణకు భారత ప్రభుత్వం, అటవీశాఖ ప్రత్యేక స్కైవేల నిర్మాణాలను అందుబాటులో ఉంచారంటే మరి ఆ ప్రాణి ఎంత విలువైన వన్యప్రాణి సంపధో మనం అర్థం చేసుకోవాలి. అంత ప్రాధాన్యతను సంతరించుకున్న వన్యప్రాణి ఏమిటనుకుంటున్నారా..? అదే ‘సింహపు తోకల కోతి’, ఇంగ్లీష్‌లో లయన్ టెల్డ్ మకాక్‌గా వ్యవహరించే ఈ వాన ర జాతి నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో కూడా తమ ఉనికిని చాటుతున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జూపార్కులలలో సుమారు 500 పైగా ఇవి వన్యప్రాణి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి.

ప్రమాదకరస్థితిలో లయన్ టెల్డ్ మాకాక్‌లు :

మన భారతదేశ పశ్చిమ కనుమలలో తప్ప ఎక్కడా వీ టి సంతతి లేదనేది అధికారికంగా వైల్డ్‌లైప్ శాస్త్రవేత్త లు తేల్చిన నిజం. కానీ ఆ పర్వత శ్రేణులే ఇక్కడి అరుదైన, అత్యంత పురాతనమై వానర జాతికి ఉనికి పెను ముప్పుగా మారింది. అలాగే కాఫీ, టీ తోటల పై స్వై ర విహారం చేసే ఈ వానర దండుకు వ్యవసాయ దా రుల నుంచి వేట రూపంలో మరణాలు సంభవిస్తాయ ని తెలుస్తుంది. ఇక ఆహార వేటలో గుంపులుగా భ యలు దేరి వెళ్లె సింహాపు తోక కోతులు పర్వత చరియలనుపై నుంచి జారి పడి మృతువాత పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే రెండు చీలి ఉండే పర్వత శ్రేణుల పై అటు నుంచి ఇటు రాకపోకలు సాగించే సమయంలో అవి మార్గంలో ప్రమాదాలకు గురై తనువు చాలిస్తున్న సంఘటనలే అధికమని అధికారులు గుర్తించారు. దా ంతో అటవీ,పర్యావరణ వాటి రాకపోకలకు అనుగుణ ంగా పర్వత ప్రాంతాల్లోని చెట్ల పై వెదురు కట్టెలతో స్కై వేలను ఈ వానరాల సంచారానికి అనుగుణంగా ఏర్ప ట్లు చేస్తుంటారు. ప్రస్తుతం లయన్ టెల్డ్ మకాక్‌ల ఉని కి క్షిత దశలోకి చేరుతుంది. వీటి పురరుత్పత్తి అధికం గా జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత సూచిస్తోంది.

సింహాపు తోక కలిగి ఉండడమే ప్రత్యేకత :

ఇక సింహానాకి ఏ విధంగా అయితే తోక ఉంటుందో అదే రీతిన లయన్ టెల్డ్ మాక్‌లకు తోక ఉంటుంది. అందుకే దీనికి సింహాపు తోకల కోతి అనే పేరు వచ్చి ంది. ఇవి 40 నుంచి 61 సెం.మీల పొండవు ఉంటా యి. వీటి తోక శరీర పొడవుకు అధనంగా మరో 24 నుంచి 38 సెంమీ వరకు పెరుగుతుంది. 5 నుంచి 10 కిలోల బరువు మగ మకాక్‌లు ఉంటే ఆడ జంతువు 3 నుంచి ఆరు కిలోల బరువు వరకు తూగుతుంది. వీటి శరీరంపై నల్లటి దట్టమైన వెంక్రుటలతో కప్పబడి ఉ ంటుంది. ముఖం చుట్టూ బుడిద రంగులో సింహం లాంటి వెంట్రుకలు వీటికి ప్రత్యేక ఆకర్శన తీసుకువస్తాయి.

బహుభార్యత్వానికే మగ జంతువు మొగ్గు :

చాలా వరకు వన్యప్రాణుల్లో మగ జంతువే తన గ ంభీరాన్ని చాటుతుంటాయి. అలాగే సింహపు తో క కోతులలో కూడా మగ మకాక్ మందకు లీ డర్‌గా వ్యవహరిస్తుంది. ఇది తనదైన శైలిలో జీ వనం సా గించే ప్రాంతానికి సరిహద్దులను సైతం పెడుతుది. ఇక మందలో ఉన్న ఆడ జంతువు సి గ్నల్ ఇచ్చిందంటే దానితో గడపడానికి మందలో సత్తాచాటే మగ కోతి ముందుకు కదులుతుంది. అలా మందలోని సంతాన పరిపక్వతకు వచ్చిన ఆడ జంతువులను అధికంగా తన వశం చేసుకోవడానికి మగ సి ంహపు తోకల ఇష్టపడుతుంది దాంతో వీటిని బహుభార్యత్వం సాగించే వన్యప్రాణిగా కూడా చెప్ప వ చ్చూ. ఇలా వాటి ఆడ, మగ కలయికల అనంతరం గర్భం దాల్చే ఆడ కోతి ఆరు మాసాల గర్భాదారణ సమయంలో తడవకు ఒక పిల్లకు జన్మనిస్తుంది. పు ట్టిన పిల్లలు నల్లగృ చాలా మృదువుగా ఉంటాయి. పుట్టిన పిల్లలను రెండు నెలల పాటు కంటికి రెప్ప లా కాపాడే లయన్‌టెల్డ్ మాకాక్‌లు అనంతరం వా టి పర్యవేక్షణ అంతగా పట్టించుకోవు.

ఇవి సతత హరిత, సాధారణ హరిత, వర్షాలు కురిసే ఆరణ్యాలతో ఆపాటు రుతు పవన ఆడవులలో సాగిస్తాయి. ఒకే గ్రూపులో ఉండేందుకు ఇష్టపడే ఆడవి మకాక్, కొత్త సమూహం వైపే మగ జంతువు దృష్టిఇక సింహపు తోక కోతులలో మగ కోతులు ఆడ జంతువులు, పిల్ల జంతువుల పట్ల చాలా ప్రేమగా ఉం టాయి. వాటిని దాదాపు తమతో కలసి జీవనం సా గించడానికి పూర్తి సహకారం అందిస్తాయి. దీంతో దాదాపు కౌమారదశకు చేరుకునే వరకు అవి ఒకే గ్రూపులో ఉంటాయి. ఒక గ్రూపులో 20 నుంచి 3 5 వరకు సింహపు తోక కోతులు ఉంటాయి.కానీ మ గ సింహపు తోక కోతులు మాత్రం గ్రూపులో పెత్త నం చేసే మగ జంతువు టీమ్ నుంచి వేరుపడి తా ము సొంతంగా గ్రూప్ సిద్ధ్దం చేసుకోవాలని ఆలోచిస్తుంటాయి.

అదను చూసి ప్రమాదవశాత్తు గ్రూ ప్‌లో పెత్తనం సాగించే మగ జంతువు గాయాల భా రీన పడినప్పుడు కొత్తగా టీమ్‌ను సిద్ధ్దం చేసుకోవడంలో సిద్ద హస్తత చూపుతాయి మగ సింహపు తోక కోతులు. దాంతో కొత్తగా కుటు ంబ సమూహాన్ని ఏర్పాటు చేసుకోవడమో , గాయపడిన మగ సి ంహం తాలుకు పెత్తనం మొదలు పెట్టి గ్రూప్ లీడర్‌గా ఎదుగుతాయి. ఇలా సాధారణంగా అడవుల్లో అయితే 30 ఏళ్ల జీవిత ప్రాణం కలిగి ఉండే సిం హపు తోక కోతులు జంతు ప్రదర్శన, సంరక్షణ శా లలో మాత్రం మరో 8 ఏళ్లు అధనంగానే జీవిస్తాయి. ఇక పశ్చిమ కనుమల్లో ఇవి 20 ఏళ్లు జీవించడం గరిష్ట ఆయుర్ధాయంగా శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

నెహ్రూ జూ పార్కులో సందర్శకులను ఆకట్టుకుంటున్న
లయన్‌టెల్డ్ మకాక్‌లు
పదేళ్లుగా లయన్‌టెల్డ్ మకాక్‌లను ప్రతియేటా దత్తతకు
తీసుకుంటున్న భారతీయ విద్యాభవన్ విద్యార్థులు
ప్రమాదకర స్థితిలో లయన్‌టెల్డ్ మకాక్స్
పర్వత ప్రాంత రహదారుల్లో ప్రమాదాల నివారణకు
స్కైవేలను అందుబాటులో ఉంచుతున్న ప్రభుత్వం
అత్యంత పురాతనమైన వన్యప్రాణి సంతతికి చెందిన
వానరంగా రికార్డు
సింహపు తోక కలిగి ఉండడమే వీటి విశిష్టత
బహు భార్యత్వానికే మగ జంతువు మొగ్గు
ఒకే గ్రూపులో ఉండేందుకు ఇష్టపడే ఆడవి మకాక్,
కొత్త సమూహం వైపే మగ జంతువు దృష్టి
పర్యావరణ వ్యవస్థలో మాకాక్‌లదీ కీలక పాత్రే..
ఆహార వేటలో ప్రమాదాల నుంచి రక్షణకు పొట్టకు
సరిపోయేంత నోటిలోని దవడలోల దాచడం ప్రత్యేకత

పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర

ఆహారపు వేటలో తెల్లవారు జాము నుంచి సాయంత్రం వరకు సాగే వీ టి ప్రయాణం ఒక్కోసారి వేటగాళ్ల వల్ల, మాంసాహార జంతువులు, పాముల వల్ల ప్రాణ హానీ వీటి కలుగుతుంది. అందుకూ ఆహార వేట లో వాటి పొట్టలోని ఆహార వ్యవస్థకు సరిపోవు ఆహారాన్ని నోటిలోని చెంపల కింది భాగంలో పర్సులను పోలిన విధంగా ఉండే ప్రాంతంలో దాచుకుంటాయి. త్వరత్వరగా ఆహారం సేకరించే ఇవి వాటిని దవడల్లో దాచుకుని తిరుగు ప్రయాణం ప్రారంభిస్తాయి. ఇలాంటి సమయాల్లో అవి ఆహారంగా తీసుకునే పండ్లు నోటి ద్వారా తీసుకుని వెళుతూ ఇక్కడక్కడ పడడం వల్ల ఆయా పండ్ల గింజలు భూమిపై పడి మొక్కలుగా మొలకొత్తి వృక్షాలుగా వృద్ధి చెందాయి. దాంతో పర్యావరణ వ్యవస్థలో కూడా సీతాకోక చిలుక మాదిరి లయన్ టెల్డ్ మాకాక్‌లు తమ వంతు పాత్ర పోషిస్తాయనడంతో అతిశయోక్తిలేదు.

పదేళ్లుగా విద్యార్థుల దత్తత స్వీకారం

నగరలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ఉన్న లయన్ టెల్డ్ మాకాక్‌లను భారతీయ విద్యాభవన్ విద్యార్థులు జంతుదత్తత స్వీమ్ ద్వారా దత్తతకు తీసుకుంటున్నారు. చాలా మందికి వరుసగా విద్యార్థులు వాటినే ఉందుకు తీసుకుంటున్నారనే ఆలోచన రావడం సహజం. కానీ అత్యంత ప్రమాదకరస్థితిలో ఉన్న వానర జాతిని తమవంతుగా కాపాడేందుకు వాటి ఆలన , పాలనకు అయ్యే ఖర్చును చెక్కు రూపంలో విద్యార్థులు పొగు చేసిన నగదును అందజేస్తు వస్తున్నారు.

lion tailed macaque

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సింహపు తోక కోతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: