ఎసిబి వలలో లైన్‌మెన్

  శంషాబాద్ : లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యండెడ్‌గా సోమవారం ఉదయం శంషాబాద్ మండల పరిధిలోని పెద్దషాపూర్ ఏఈ కార్యాలయంలో లైన్‌మెన్‌గా పని చేస్తున్న కాశీ రెడ్డి పట్టుబడిన సంఘటన తీవ్ర సంచలనం రేపింది. ఎసిబి సూర్యనారయణ తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ మండల పరిధిలోని తొండుపల్లి గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి తన ఇంట్లో కరెంట్ మీటర్ కోసం పెద్దషాపూర్ ఏఈ కార్యాలయంలో ధరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అయితే తన […] The post ఎసిబి వలలో లైన్‌మెన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

శంషాబాద్ : లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యండెడ్‌గా సోమవారం ఉదయం శంషాబాద్ మండల పరిధిలోని పెద్దషాపూర్ ఏఈ కార్యాలయంలో లైన్‌మెన్‌గా పని చేస్తున్న కాశీ రెడ్డి పట్టుబడిన సంఘటన తీవ్ర సంచలనం రేపింది. ఎసిబి సూర్యనారయణ తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ మండల పరిధిలోని తొండుపల్లి గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి తన ఇంట్లో కరెంట్ మీటర్ కోసం పెద్దషాపూర్ ఏఈ కార్యాలయంలో ధరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అయితే తన ఇంట్లో మీటర్ పిట్ చేయాలంటే రూ.60వేలు ఇవ్వలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. చివరకు రూ28వేలకు బేరం కుదిరిందన్నారు. దీంతో తిరుపతి రెడ్డి ఎసిబి అధికారులను సంప్రదించినట్లు తెలిపారు.

ఈ రోజు తొండుపల్లిలోని ఓ హోటల్‌లో లైన్‌మెన్ కాశీరెడ్డికి బాధితుడు తిరుపతి రెడ్డి డబ్బులు ఇస్తునట్లు సమాచారం ఇవ్వడంతో పక్కప్లాన్ వేసి రెడ్ హ్యండెడ్‌గా పట్లుకున్నట్లు తెలిపారు. ఇలాగే ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ధైర్యంగా వచ్చి తమను సంప్రదిస్తే అవినీతి తిమింగాలలను పట్టుకుంటాం అన్నారు. కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకొని ఎసిబి కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు.

Line men caught by ACB while taking Bribe

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎసిబి వలలో లైన్‌మెన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.