గ్రంధాలయంలో చెల్లా చెదురుగా పుస్తకాలు…

  నాంపల్లి : పుస్తకాలు పాఠకులకు నేస్తం… వారిలో పఠనాసక్తిని పెంచుతూ విజ్ఞానాన్ని సంపదను పెంచే బాండాగారాలు…. ప్రాచీన, ఆధునీక దేశ, విదేశీ చరిత్రతోపాటు అనేక విలువైన సమాచారం గ్రంధాల ద్వారా తెలుస్తున్నాయి. ఆలాంటిది ఒకటి, రెండు కాదు ఇలా …. విభిన్న రకాల పాఠ్యపుస్తకాలు, సైన్స్, చిన్నారుల సాహిత్యం, కార్టున్లకు సంబంధించి విలువైన సాహిత్యం ఇలా వేల సంఖ్యలో అక్కడ వృధాగా పడి ఉన్నాయి. అదే నాంపల్లి ప్రభుత్వ గ్రంధాలయంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ […] The post గ్రంధాలయంలో చెల్లా చెదురుగా పుస్తకాలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నాంపల్లి : పుస్తకాలు పాఠకులకు నేస్తం… వారిలో పఠనాసక్తిని పెంచుతూ విజ్ఞానాన్ని సంపదను పెంచే బాండాగారాలు…. ప్రాచీన, ఆధునీక దేశ, విదేశీ చరిత్రతోపాటు అనేక విలువైన సమాచారం గ్రంధాల ద్వారా తెలుస్తున్నాయి. ఆలాంటిది ఒకటి, రెండు కాదు ఇలా …. విభిన్న రకాల పాఠ్యపుస్తకాలు, సైన్స్, చిన్నారుల సాహిత్యం, కార్టున్లకు సంబంధించి విలువైన సాహిత్యం ఇలా వేల సంఖ్యలో అక్కడ వృధాగా పడి ఉన్నాయి. అదే నాంపల్లి ప్రభుత్వ గ్రంధాలయంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ విలువైన సంపదను పాఠకులు చదవడానికి వీల్లేని పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి.

పుస్తకాల ప్రాధాన్యతను పాలకులు పూర్తిగా విస్మరించారు. జనం సొమ్ముతో కొనుగోలుచేసిన అనేక పుస్తకాలకు భద్రత లేకుండా ఉన్నాయి. గ్రంధాలు పేజీలు తిప్పితే చాలు చినిగి బయటికి వస్తున్నాయి. కొన్ని బూజు పట్టి, దూమ్ముధూళితో నేలపై కనిపిస్తున్నాయి. ఈ విలువైన సాహిత్య సంపదను నేటి తరం వారికి ఉపయోగపడలా చేయడంలో అధికారులు మరిచారు. రాక్‌ల కొరత వల్లనే పుస్తకాలకు భద్రతలేదు. ఇనుప రాక్‌లో సురక్షితంగా ఉండాల్సిన గ్రంధాలు నేలపై ఎక్కడ పడితే అక్కడే పారేయడాన్ని చూసిన వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.

ఏళ్ల క్రితం కొనుగోలుచేసిన పుస్తకాలు ఎందుకు పనికిరాకుండా పారేశారు. ఈవిషయాన్ని తరుచూ తనిఖీలకు వస్తున్న అధికారులకు లైబ్రరీలో పుస్తకాల భద్రత గురించి పలుమార్లు చెబుతున్నాం కానీ నేటివరకు చర్యలు తీసుకోలేదని పలువురు పాఠకువల ఆవేదన..  ప్రతి రోజూ వందల సంఖ్యలో పాఠకులు లైబ్రరీకి వస్తుంటారు. మహిళలకు ప్రత్యేక గది లేదు, పాఠకులు సౌకర్యాలకు నోచుకోవడం లేదు. దీంతో మహిళలు రావడం మానేశారు.

తాజా కొత్త పుస్తకాలు ఏవీ…

మార్కేట్‌లోకి వస్తున్న కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేవు. లేటెస్ట్ సంబంధించిన పుస్తకాలు కోసం యువత, పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్నవారు ఎదురుచూడక తప్పడం లేదు. దీంతో ఉన్న వాటినే తిరిగేయాల్సిందే… పీజీ, పోటీపరీక్షల సంబంధించిన కొత్త పాఠ్యపుస్తకాలు ఉండటం లేదు. దీంతో లైబ్రరీలో చదవాల్సిన పుస్తకాలు లేక కొందరు వెనుదిరిగిపోతున్నారు. కింద గ్రౌండ్‌ఫ్లోర్ గదిలో దినపత్రికలు, మ్యాగజైన్ల పుస్తకాలు మాత్రమే ఉంటున్నాయి. పక్కనే పాఠ్యపుస్తకాలు చదవడానికి ఇరుకుగా ఉంది. దీంతో యువకులు ఎక్కువగా రావడంతో వారు అసౌకర్యానికి గురవుతున్నారు. వారికి బాత్‌రూంలు లేవు. ఉన్నవి సిబ్బందికే పరిమితమయ్యాయి. ఈ విషయాన్ని అధికారులకు చెబుతున్నాం కానీ వారు తీవ్రంగా పరిగణించడం లేదు.

విలువైన పుస్తకాలు భద్రపరిచాలి సామాజిక వేత్త జి.ఎస్.శివకుమార్

పాత పుస్తకాల ప్రాధానాన్ని అధికారులు విస్మరించారు. ఇవి పాఠకులకు నిజమైన నేస్తం… ఆలాంటి విలువైన గ్రంధాలకు భద్రత లేదు. చాన్నాళ్ల క్రితం ముద్రించిన పుస్తకాలు వేల సంఖ్యలో కింద పడేసి ఉన్నాయి, వీటిని రాబోయే యువత చదవడానికి వీలుగా భద్రత పరిచేందుకు కొత్తగా రాక్‌లు కొనుగోలు చేయాలి.

పాత గ్రంధాలు అమ్మెయాలి…పాఠకులు మహమ్మద్ ఉస్మాన్ 

వేల సంఖ్యలో పాత పుస్తకాలు చదవడానికి వీల్లేకుండా ఉన్నాయి. వీటిని చాన్నాళ్లుగా పాఠకులు చదవడం లేదు. దుమ్ముధూళితోనిండిన పేజీలు,. మద్యలో కొన్ని పేజీలు చినిగి ఉన్నాయి. వీటిని అమ్మెసి కొత్త పుస్తకాలు కొనుగోలుచేసి పాఠకులకు అందుబాటులో ఉంచాలి.

Libraries Increase Knowledge

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గ్రంధాలయంలో చెల్లా చెదురుగా పుస్తకాలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.