మహేందర్ రెడ్డిని గెలిపిద్దాం…

  జెడ్పిటిసి, ఎంపిటిసిలతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రంగారెడ్డి: స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలలో టిఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థ్ది మాజీ మంత్రి మహేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మంత్రులు కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డిలతో కలిసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని శాసనసభ్యులతో మండలి ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం చెవెళ్ల, పరిగి, వికారాబాద్, మహేశ్వరం, ఇబ్రహింపట్నం, రాజేంద్రనగర్ నియోజకవర్గాలలో టిఆర్‌యస్ […] The post మహేందర్ రెడ్డిని గెలిపిద్దాం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జెడ్పిటిసి, ఎంపిటిసిలతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

రంగారెడ్డి: స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలలో టిఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థ్ది మాజీ మంత్రి మహేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మంత్రులు కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డిలతో కలిసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని శాసనసభ్యులతో మండలి ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు.

అనంతరం చెవెళ్ల, పరిగి, వికారాబాద్, మహేశ్వరం, ఇబ్రహింపట్నం, రాజేంద్రనగర్ నియోజకవర్గాలలో టిఆర్‌యస్ పార్టీ ఎంపిటిసి, జడ్పీటిసి సభ్యులతో సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 31 న జరుగబోయే రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో మన అభ్యర్థ్ది మహేందర్ రెడ్డి విజయానికి మనమందరం కృషి చేయాల న్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో చెపట్టవలసిన కార్యక్రమాలపై నేతలకు, జడ్పీటిసి, ఎంపిటిసిలకు దిశానిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, కాలే యాదయ్య, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అనంద్ , ప్రకాష్‌గౌడ్, నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, టిఎస్‌ఐఐసి చైర్మెన్ గ్యాదరి బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.

 

Let’s win Mahender Reddy

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మహేందర్ రెడ్డిని గెలిపిద్దాం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: