రోహిత్‌ను వదిలేయండి…

ఓపెనర్ రోహిత్ శర్మపై అతిగా స్పందించడం మానుకోవాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సూచించాడు. ప్రపంచ క్రికెట్‌లోనే రోహిత్ అత్యుత్తమ ఓపెనర్ అనడంలో సందేహం లేదని, టెస్టుల్లో అతను ఎలా ఆడుతాడో అనే విశ్లేషణలు సరికాదన్నాడు. దక్షిణాఫ్రికాతో గురువారం నుంచి జరిగే రెండో టెస్టును పురస్కరించుకుని కోహ్లి మీడియా సమావేశంలో మాట్లాడాడు. రోహిత్ తానెంటో తొలి టెస్టులోనే నిరూపించాడు. ఫార్మాట్ ఏదైనా ఓపెనర్‌గా తనకు తిరుగులేదని విషయాన్ని విశాఖలోనే స్పష్టం చేశాడు. ఇకపై అతని బ్యాటింగ్‌పై చర్చ అనవసరమన్నాడు. ఓపెనర్ అవతారమెత్తిన మొదటి మ్యాచ్‌లోనే వరుసగా రెండు సెంచరీలు బాది తానెంటో నిరూపించాడన్నాడు. దీంతో రోహిత్ ఎలా ఆడతాడో అనే దానిపై వాదనలు అవసరం లేదన్నాడు. మరోవైపు రెండో టెస్టును తాము తేలిగ్గా తీసుకోవడం లేదన్నాడు. సౌతాఫ్రికా వంటి బలమైన జట్టును ఓడించడం అనుకున్నంత తేలికకాదన్నాడు. ఏమాత్రం నిర్లక్షం వహించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా ప్రతి ఆటగాడు తన పాత్రను సమర్థంగా నిర్వర్తించాలని కోహ్లి సూచించాడు.

Let Rohit Sharma Enjoy Red Ball Cricket: Virat Kohli

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రోహిత్‌ను వదిలేయండి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.