చిరుత చిక్కదు…చింత తీరదు…

  కడ్తాల్: జిల్లాలోని కడ్తాల్, యాచారం మండలాల్లో పశువులపై చిరుత పులి వరుస దాడులు చేస్తూ హడలెత్తిస్తుంది. రెండు రోజుల క్రితం యాచారం మండలంలో పశువుల పాకపై దాడి చేసి లేగదూడను చంపిన చిరుత శనివారం రాత్రి కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి సమీపంలో రైతు పుట్టి యాదయ్య పశువుల పాకలో లేగదూడపై దాడి చేసి చంపింది. ఆదివారం ఉదయం పొలం వద్దకు వెల్లిన రైతు యాదయ్య లేగ దూడ గాయాలతో చనిపోయి ఉండటాన్ని చూసి స్థానిక నాయకులు, […] The post చిరుత చిక్కదు… చింత తీరదు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కడ్తాల్: జిల్లాలోని కడ్తాల్, యాచారం మండలాల్లో పశువులపై చిరుత పులి వరుస దాడులు చేస్తూ హడలెత్తిస్తుంది. రెండు రోజుల క్రితం యాచారం మండలంలో పశువుల పాకపై దాడి చేసి లేగదూడను చంపిన చిరుత శనివారం రాత్రి కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి సమీపంలో రైతు పుట్టి యాదయ్య పశువుల పాకలో లేగదూడపై దాడి చేసి చంపింది. ఆదివారం ఉదయం పొలం వద్దకు వెల్లిన రైతు యాదయ్య లేగ దూడ గాయాలతో చనిపోయి ఉండటాన్ని చూసి స్థానిక నాయకులు, గ్రామస్తులకు తెల్పడంతో వారు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. ఆరు నెలలుగా చిరుత పులి పశువులపై వరుస దాడులు చేసి చంపుతుండటంతో కడ్తాల్, యచారం మండలాల్లోని పలు గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది.

రాత్రి వేళల్లో అటవీ ప్రాంతం నుంచి పశువుల పొలాలకు వచ్చి పాకల్లో కట్టిన పశువులపై చిరుత దాడి చేస్తుండటంతో ప్రజలు, రైతులు భయాందోళనలకు గురువుతున్నారు. చిరుతను బంధించడానికి అధికారులు అటవీ ప్రాంతంలో బోనులు ఏర్పాటు చేసినా, ప్రత్యేక నిపుణుల బృందాన్ని రంగంలోకి దింపినా వారి ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. పశువులపై దాడి చేస్తున్నది చిరుతపులేనని అధికారులు ఏర్పాటు చేసిన సిసి కెమెరాల్లో చిరుత దాడి దృశ్యాలు స్పష్టంగా నమోదవుతున్నాయి. కడ్తాల్, యాచారం, కందుకూర్ మండలాల పరిధిలో సుమారు 6వేల హెక్టార్‌లలో అటవీ ప్రాంతం రాళ్లు, చెట్లతో దట్టంగా ఉండటంతో చిరుతను బంధించడం అటవీ శాఖ అధికారులకు ఇబ్బందికరంగా మారింది.

అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న కడ్తాల్ మండలంలోని ఎక్వాయిపల్లి, మైసిగండి, గోవిందాయపల్లి, జమ్ముల బావి, గానుగుమర్ల తండా, ముద్విన్, చరికొండ, యచారం మండలంలోని తాడిపర్తితో పాటు పలు గ్రామాల్లో చిరుత రెండు మూడు రోజులకొసారి దాడి చేస్తూ లేగదూడలను చంపుతుండటంతో రైతులు బెంబెలెత్తుతున్నారు. అధికారులు ఏర్పాటు చేసిన బోనులలో చిరుత చిక్కకుండా ముప్పు తిప్పలు పెడుతుంది. ఎప్పుడు ఎక్కడ ఎవరి పశువులపై దాడి చేసి చంపుతుందోనని ప్రతి రోజు భయాందోళనలకు గురువుతున్నామని రైతులు వాపోతున్నారు. చిరుత దాడి చేసి లేగ దూడలను చంపిన తరువాతా అటవీ అధికారులు నష్ట పరిహారం ఇచ్చి సరిపెడుతున్నారని అన్నదాలు విమర్శిస్తున్నారు. చిరుత ఇలాగే వరుస దాడులు చేస్తే తాము గ్రామాలను విడిచి వెల్లాల్సి వస్తుందేమోనని అవేదన వ్యక్తం చేస్తున్నారు.

రంగంలోకి నిపుణులు….చిరుతను బంధించడానికి ప్రత్యేక అధికారుల బృందాన్ని రంగంలోకి దింపినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతంలోని నిపుణులతో పాటు జూపార్క్ నుంచి అధికారుల బృందం అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టి చిరుతను బంధించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. చిరుతను పట్టుకోవడానికి బోనులతో పాటు అది సంచరించే ప్రాంతాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. రైతులు అందోళన చెందవద్దని, అప్రమత్తంగా ఉండాలని చిరుతను త్వరలోనే బంధిస్తామని అన్నారు.

రెండు చిరుతలున్నాయా….పెద్ద ఎత్తున విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో పశువులపై దాడి చేస్తున్నది ఒకే చిరుతా లేక రెండు చిరుతలున్నాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నవి ఆడా, మగా రెండు పులులున్నట్లు అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. కడ్తాల్ మండలంలోనే ఇప్పటి వరకు సుమారు 23 దూడలపై చిరుత పులి దాడి చేసి చంపడంతో రైతులు, ప్రజలు హడలెత్తిపోతున్నారు.

ఎమ్మెల్సీ కసిరెడ్డి పరామర్శ

చిరుతపులి దాడి చేసిన ప్రదేశాన్ని ఆదివారం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారయణరెడ్డి పరిశీలించి బాధిత రైతును పరామర్శించారు. అటవీ ప్రాంతంలోకి వెల్లి సంఘటన స్థలాన్ని గమనించి రైతు, అధికారులతో మాట్లాడి వివరాలు తెల్సుకున్నారు. బాదిత రైతుకు ఆర్థిక సహాయం అందించి అటవీ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరగా చిరుతను బంధించాలని సూచించారు. రైతులు ఆందోళన చెంద వద్దని, చిరుత పులిని బంధించడానికి అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అటవీశాఖ అధికారులు, జూపార్క్ అధికారులు, నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి ప్రత్యేక బృందం చిరుతను బంధించడానికి అటవీ ప్రాంతంలో గాలిస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్సీ వెంట సర్పంచ్ సుగుణ సాయిలు, మాజీ ఎంపిటిసి బుగ్గయ్య గౌడ్, బిజెవైఎం మండల అధ్యక్షుడు జంగం వెంకటేష్, పుట్టి యాదయ్య, గంటి పర్వతాలు, జంగయ్య, బద్రిపల్లి పాండు తదితరులు ఉన్నారు.

Leopard Attack on livestock

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చిరుత చిక్కదు… చింత తీరదు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: