అసెంబ్లీ ప్ర‌త్యేక‌ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ…

Legislative sessions

 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాల తేదీలను ఖరారు చేస్తూ గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 18న శాసనసభ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభంకానుంది. 19వ తేదీన శాసనమండలి సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది.

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న మున్సిపల్ చట్టం ఆమోదం కోసమే ఈ సమావేశాలను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. మున్సిపల్ చట్టం బిల్లు ఆమోదానికే ఉభయ సభలు పరిమితం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, ఇతర అంశాలపై చర్చ ఉండదని ఇప్పటికే సిఎం కార్యాలయం ప్రకటించింది. రాష్ట్రంలో నూతన చట్టం అమల్లోకి వచ్చిన తరువాతనే ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిల్లుకు తుదిరూపం ఇవ్వాడనికి ముసాయిదా చట్టాన్ని తీసుకొస్తోంది.

 

Legislative sessions to ratify new Municipal Law

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అసెంబ్లీ ప్ర‌త్యేక‌ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.