రంగారెడ్డి జడ్పీ పీఠంపై నేతల గురి

రంగారెడ్డి  : రంగారెడ్డి జిల్లా జడ్పీ పీఠంపై రాజకీయ పార్టీ  నేతలు కన్నేశారు. ఎంపి, ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ మొత్తంలో నిధులు ఉండటంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రోటోకాల్ వర్తించే జడ్పీ చైర్మెన్ పదవి దక్కించుకోవడం ద్వారా జిల్లా రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించడానికి బడానేతలు చాలా మంది మంత్రాంగం షురూ చేశారు. రంగారెడ్డి జిల్లా పరిషత్‌లో పుష్కలంగా నిధులు ఉండటంతో పెద్ద ఎత్తున అభివృద్ది పనులు చేసే అవకాశం ఉండటంతో పాటు జనంలోకి దూసుకుపోయి రాజకీయంగా […] The post రంగారెడ్డి జడ్పీ పీఠంపై నేతల గురి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రంగారెడ్డి  : రంగారెడ్డి జిల్లా జడ్పీ పీఠంపై రాజకీయ పార్టీ  నేతలు కన్నేశారు. ఎంపి, ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ మొత్తంలో నిధులు ఉండటంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రోటోకాల్ వర్తించే జడ్పీ చైర్మెన్ పదవి దక్కించుకోవడం ద్వారా జిల్లా రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించడానికి బడానేతలు చాలా మంది మంత్రాంగం షురూ చేశారు. రంగారెడ్డి జిల్లా పరిషత్‌లో పుష్కలంగా నిధులు ఉండటంతో పెద్ద ఎత్తున అభివృద్ది పనులు చేసే అవకాశం ఉండటంతో పాటు జనంలోకి దూసుకుపోయి రాజకీయంగా ఎదగడానికి మంచి అవకాశం ఉంది. దీంతో సీనియర్ నేతలతో పాటు మాజీ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు సైతం పోరుకు సిద్దమవుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో 27 మండలాలు ఉండగా, అందులో ఆరు శివారు మండలాలను గ్రేటర్‌తో పాటు మున్సిపాలిటిలుగా మార్చడంతో గ్రామీణ ప్రాంతంలోని 21 మండలాల్లో మాత్రమే జడ్పీటిసి సభ్యుల ఎన్నిక జరుగనుంది. 21 మండలాల్లో ఎస్టీ 2, ఎస్టీ మహిళ 1, ఎస్సీ జనరల్ 3, ఎస్సీ మహిళ2, బిసి జనరల్ 1, బిసి మహిళ 1. జనరల్ 6 , జనరల్ మహిళకు 5 మండలాల చొప్పున రిజర్వేషన్‌లు ప్రకటించారు. జడ్పీ పీఠం జనరల్ మహిళగా ప్రకటించడంతో అన్ని వర్గాల వారికి పదవి దక్కించుకోవడానికి అవకాశం ఉండటంతో ఎవరికి వారుగా తమ ప్రయత్నాలు ప్రారంభించారు. శాసనసభ ఎన్నికలలో మహేశ్వరం మినహ మిగిలిన గ్రామీణ మండలాల్లో గులాబీ దళం హవా కొనసాగగా లోక్‌సభ ఎన్నికల ముందు రాజకీయ పునరేకికరణలో మహేశ్వరం నుంచి కాంగ్రెస్ తరపున విజయం సాధించిన సబితారెడ్డి సైతం గులాబీ వైపు మొగ్గు చూపడంతో హస్తం అస్తవ్యస్తమైంది. కారు మాత్రం  జోరు మీద ఉంది. ప్రస్తుతం జిల్లాలో కారు ప్రభంజనం తట్టుకుని నిలబడి పోరాటం చేసి జడ్పీ పీఠంను దక్కించుకునే పరిస్థితులు ఇతర పార్టీలకు పెద్దగా లేకపోవడంతో టిఆర్‌ఎస్‌లోని ముఖ్య నేతలు జడ్పీ పీఠంపై దృష్టి సారించారు.

రంగంలోకి బడా నేతల కుటుంబీకులు
రంగారెడ్డి జిల్లా పరిషత్ బడానేతల కుటుంబాలకు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పది సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సునీతారెడ్డి మరో చాన్స్ ఉన్న ఆమె వికారాబాద్ జిల్లా వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. సునీతారెడ్డి బరిలోకి వస్తే ఇతరులకు పదవి దక్కే అవకాశం కష్టమే. గులాబీ దళపతి కెసిఆర్ సోమవారం  జరిగిన టిఆర్‌యస్ ఎమ్మెల్యేలు ముఖ్యుల సమావేశంలో ఆదిలాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, పెద్దపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లాలో సైతం మాజీ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు పదవి దక్కనుందని ప్రచారం తెరమీదకు వచ్చింది. మాజీ ఎమ్మెల్యే తీగల క్రిష్ణారెడ్డి కోడలు డా. అనితారెడ్డిని మహేశ్వరం, కందుకూర్ మండలాల నుంచి జడ్పీటిసిగా బరిలోకి దింపి జడ్పీ పీఠంపై కూర్చోపెట్టనున్నారని ప్రచారం జరుగుతుంది. షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి సతీమణి చరితారెడ్డిని ఫరూక్‌నగర్ లేదా కొత్తూర్, కేశంపేట్ మండలాల నుంచి రంగంలోకి దింపి జడ్పీ పీఠం ఇచ్చేలా సైతం టిఆర్‌యస్ పావులు కదుపుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులలో ఒకరిని షాబాద్ నుంచి బరిలోకి దింపి జడ్పీ పీఠం కోసం ప్రయత్నించే అవకాశం ఉందని సైతం వినికిడి. చెవెళ్ల మాజీ ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ మాజీ చైర్మెన్ కె.యస్.రత్నం సైతం తమ కుటుంబ సభ్యుల కోసం పావులు కదుపుతున్నారని ఇప్పటికే ఇటివల టిఆర్‌యస్‌లో చేరుతున్న సమయంలో ఆయనకు స్పష్టమైన హమీ వచ్చిందని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలతో పాటు మరో బడానేత, వ్యాపారవేత్త సైతం అవకాశం దక్కితే తమ కుటుంబ సభ్యులకు జడ్పీ పీఠం దక్కించుకోవడానికి మంత్రాంగం నడిపిస్తున్నట్లు వినికిడి. జిల్లా కాంగ్రెస్‌లో సైతం కొంత మంది నేతలు జడ్పీ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. జిల్లా పరిషత్‌లో కాంగ్రెస్ ప్లోర్ లీడర్ జంగారెడ్డితో పాటు మరో మాజీ ఎమ్మెల్యే సైతం తన సతీమణులను రంగంలోకి దించి చాన్స్ వస్తే జడ్పీ పీఠం దక్కించుకోవాలన్న ఆశతో ముందుకు సాగుతున్నారు.

Leaders Focus on Ranga Reddy ZP Chairman Post

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రంగారెడ్డి జడ్పీ పీఠంపై నేతల గురి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: