జిగేల్ రాణిలా మెరిసిపోతోంది

ఇటు దక్షిణాది చిత్రాలతో పాటు అటు బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న బ్యూటీ లక్ష్మీరాయ్. ఈ భామ తరచుగా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో సందడి చేస్తోంది. తాజాగా లక్ష్మీరాయ్ ఓ పార్టీవేర్‌లో దర్శనమిచ్చింది. వైట్ కలర్ కాస్ట్యూమ్‌లో ఆమె నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. పార్టీ వేర్‌లో తళుకు బెళుకులతో జిగేల్ రాణిలా మెరిసిపోతోంది. చెవులకు మ్యాటీ ఫినిష్డ్ స్టోన్ టాప్స్, పెదవులకు పింక్ కలర్ లిప్‌స్టిక్ ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. డిఫరెంట్ […] The post జిగేల్ రాణిలా మెరిసిపోతోంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఇటు దక్షిణాది చిత్రాలతో పాటు అటు బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న బ్యూటీ లక్ష్మీరాయ్. ఈ భామ తరచుగా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో సందడి చేస్తోంది. తాజాగా లక్ష్మీరాయ్ ఓ పార్టీవేర్‌లో దర్శనమిచ్చింది. వైట్ కలర్ కాస్ట్యూమ్‌లో ఆమె నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. పార్టీ వేర్‌లో తళుకు బెళుకులతో జిగేల్ రాణిలా మెరిసిపోతోంది. చెవులకు మ్యాటీ ఫినిష్డ్ స్టోన్ టాప్స్, పెదవులకు పింక్ కలర్ లిప్‌స్టిక్ ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. డిఫరెంట్ హెయిర్ స్టైల్‌లో సమ్‌థింగ్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తోంది లక్ష్మీరాయ్. లైటింగ్ ఎఫెక్ట్‌తో ఆమె మరింత అందంగా కనిపిస్తోంది. ఇక లక్ష్మీ రాయ్ సినిమాల విషయానికి వస్తే… తెలుగులో ‘ఆనంద భైరవి’ చిత్రంలో నటిస్తోంది. అలాగే తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌ని పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటోంది లక్ష్మీ రాయ్.

Laxmi Raai appear in white color costumes at Party Wear

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జిగేల్ రాణిలా మెరిసిపోతోంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.