జక్రాన్‌పల్లిలో ఎయిర్ పోర్టుకు కృషి చేస్తా

టిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థి కల్వకుంట్ల కవిత   మనతెలంగాణ/జక్రాన్‌పల్లి : దేశంలో బిజెపి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, తెలంగాణలో కాంగ్రెస్ కనుమరుగైపోయిన పార్టీ అని బిజెపి, కాంగ్రెస్ పార్టీలను నమ్మి ఓటు వేసే పరిస్థితిలో ప్రజలు లేరని టిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండల కేంద్రంలో టిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థి కవిత ప్రచారం సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ జక్రాన్‌పల్లిలో ఎయిర్ […] The post జక్రాన్‌పల్లిలో ఎయిర్ పోర్టుకు కృషి చేస్తా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

టిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థి కల్వకుంట్ల కవిత

 

మనతెలంగాణ/జక్రాన్‌పల్లి : దేశంలో బిజెపి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, తెలంగాణలో కాంగ్రెస్ కనుమరుగైపోయిన పార్టీ అని బిజెపి, కాంగ్రెస్ పార్టీలను నమ్మి ఓటు వేసే పరిస్థితిలో ప్రజలు లేరని టిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండల కేంద్రంలో టిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థి కవిత ప్రచారం సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ జక్రాన్‌పల్లిలో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు, ఎన్నో యేళ్ల నుంచి కలలు పెద్దపల్లి , నిజామాబాద్ ర్తైల్వే లైన్ పనులను మూడేళ్లలో రైలు మార్గం తీసుకవచ్చామన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని 29 రాష్ట్రాల్లో 24గంటల ఉచిత కరెంట్‌ను రైతులకు అందిస్తున్న రాష్ట్రం కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రమన్నారు. మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు వచ్చే నెల నుంచి రూ.2016 పెన్షన్ ఇస్తున్నమన్నారు. బీడీ కార్మికులకు పిఎఫ్ బుక్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి జీవనభృతి కల్పిస్తామన్నారు. అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలకు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్‌రూం, సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు నిర్మాణానికి రూ. 5లక్షల వరకు ఉచితంగా ఇస్తామన్నారు. డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా, పంటలను కొనుగోలు చేసే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నమన్నారు. మహిళలకు వచ్చే కమీషన్‌తో వస్తువులను తయారు చేసి మార్కెటింగ్ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. రైతులకు భవిష్యత్తులో ఎలాంటి భూ సమస్యలు తలెత్తకుండా రైతులందరికి పట్టాపాస్‌బుక్‌లు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిరుద్యోగులకు జిల్లా కేంద్రంలో ఐటి పార్క్ ఏర్పాటు చేసిన ఘనత టిఆర్‌ఎస్‌కే దక్కిందన్నారు. అభివృద్ధ్ది కోసం కారు గుర్తుకు ఓటువేసి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎంఎల్‌ఎ బాజిరెడ్డి గోవర్ధన్, ఎంఎల్‌సి విజి గౌడ్ తదితరులు పాలొనారు.

ఉద్యమంలో లాయర్ల పాత్ర మరవలేనిది
41ఎ సిఆర్‌పిసి సవరణ రద్దుకు కృషి చేస్తా
న్యాయవాదులతో ఎంపి కల్వకుంట్ల కవిత

మనతెలంగాణ/ నిజామాబాద్ ప్రతినిధి : మరోసారి ఎంపిగా భారీ మెజార్టీతో గెలిపిస్తే న్యాయవాదుల సమస్యను పరిష్కరిస్తానని, 41ఎ సిఆర్‌పిసి సవరణ రద్దుకు కృషి చేస్తానని నిజామాబాద్ టిఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇవిఎంల్లో రెండవ నెంబర్‌గా ఉన్న తనను అత్యధిక మెజార్టీతో నంబర్‌వన్ స్థానంలో గెలిపించాలని కోరారు. తెలంగాణ ఉద్యమ సాధనలో న్యాయవాదుల పాత్ర మరవలేనిదని న్యాయవాదులకు టిఆర్‌ఎస్ ఎప్పుడు అండగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. న్యాయవాదుల సంక్షేమ నిధులు వంద కోట్ల నుంచి పెంచడానికి కృషి చేస్తానని న్యాయవాదుల కుటుంబాలకు సంబంధించిన ఆరోగ్య పథకాలను ముఖ్యమంత్రి కెసిఆర్‌తో మాట్లాడి పరిష్కరిస్తానని అన్నారు. చనిపోయిన న్యాయవాదుల కోసం డెత్ బెనిఫిట్స్ గురించి తనకు తెలియదని, దీని విషయంలో కూడా పరిశీలించి పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. గంగారెడ్డి స్మారక భవన నిర్మాణం కోసం నిధులు సమకూరుస్తానని హామీ ఇచ్చారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమినార్లు నిర్వహించుకునేందుకు సరిపోయే భవన నిర్మాణానికి సహకరిస్తానని ఆమె అన్నారు.

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జక్రాన్‌పల్లిలో ఎయిర్ పోర్టుకు కృషి చేస్తా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: