లావా చెట్లు

lava-treesచెట్లుకు పండ్లు. పూలు కాయడం చూశాం.. వాటిలో పెద్ద చెట్లు, చిన్న చెట్లూ చూశాం.. కానీ ఈ లావా చెట్లు అంటే ఏంటి అనుకుంటున్నారా? చూసేద్దాం రండీ.. * హవాయి ద్వీపంలోని పహోవాలో ఉన్న ‘లావా ట్రీస్ స్టేట్ పార్కు’లో ఉంటాయి చెట్లు.
* మొత్తం 17 ఎకరాల్లో ఉన్న ఈ పార్కులో బోలెడు రకాల చెట్లూచేమలూ ఉంటాయి. వీటితో పాటు ప్రత్యేక ఆకర్షణగా ఈ లావా వృక్షాలూ ఉంటాయి. ఈ వింత చెట్లను చూడ్డానికే సందర్శకులు వస్తుంటారు.

* 1790వ సంవత్సరంలో ఇక్కడ అగ్నిపర్వతాలు పేలి ఎర్రని లావా భగభగ మండుతూ ఇక్కడి అడవి గుండా ప్రవహిస్తూ వచ్చింది. ఎత్తయిన చెట్లను పూర్తిగా కప్పేయలేదు. కానీ ఈ అడవి ఉండే ఎత్తయిన ఒహియా చెట్ల కాండాల్ని కొమ్మల్ని మొత్తం చుట్టేసింది. కొంతకాలానికి అది చల్లబడి చెట్టుపై గట్టి పొరలా ఏర్పడింది. వేడికి చెట్టంతా కాలిపోయి బూడిదైనా… చెట్టు ఆకారాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. మునుపటి వృక్షాల్లానే. లావా అచ్చులే చెట్లలా కనిపిస్తున్నాయన్నమాట. అందుకే వీటినే లావా ట్రీలుగా పిలుస్తారు.

* ఈ చెట్లు భలే గమ్మత్తుగా వింత రూపాల్లో కనిపిస్తాయి. లోపలంతా డొల్లగా పైన మాత్రం చెట్టు రూపంతో చిత్రంగా ఉంటాయి.
* మామూలు చెట్ల సైజు నుంచి మనకన్నా చాలా రెట్లు ఎత్తులోనూ ఉంటాయివి.
* ఈ ప్రదేశాన్ని సంరక్షణ ప్రాంతంగా మార్చి పార్కులా ఏర్పాటు చేశారు. సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు.

lava tree state monument park

Related Images:

[See image gallery at manatelangana.news]

The post లావా చెట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.