వివి అమృత స్పర్శ, పాణి విశాల పరామర్శ ఒక పారవశ్య ప్రతిస్పందన

  నేడు ‘వ్యక్తిత్వమే కవిత్వం’ విశ్లేషణ ఆవిష్కరణ సభ “వ్యక్తిత్వమే కవిత్వం” వరవరరావు కవిత్వ విశ్లేషణ ఆవిష్కరణ సభ జూన్ 17, 2019, సోమవారం సాయంత్రం 6. గంటలకు దొడ్డి కొమరయ్య హాల్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్ దేవిప్రియ అధ్యక్షతన జరుగుతుంది. ఆవిష్కర్త డా. బి. విజయ భారతి. ‘There are decades where nothing happens and there are weeks where decades happen’ అంటాడు వ్లాదిమిర్ ఇలీయిచ్ లెనిన్. వరవరరావు జీవితంలో […] The post వివి అమృత స్పర్శ, పాణి విశాల పరామర్శ ఒక పారవశ్య ప్రతిస్పందన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నేడు ‘వ్యక్తిత్వమే కవిత్వం’ విశ్లేషణ ఆవిష్కరణ సభ

“వ్యక్తిత్వమే కవిత్వం” వరవరరావు కవిత్వ విశ్లేషణ ఆవిష్కరణ సభ జూన్ 17, 2019, సోమవారం సాయంత్రం 6. గంటలకు దొడ్డి కొమరయ్య హాల్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్ దేవిప్రియ అధ్యక్షతన జరుగుతుంది. ఆవిష్కర్త డా. బి. విజయ భారతి.

‘There are decades where nothing happens and there are weeks where decades happen’ అంటాడు వ్లాదిమిర్ ఇలీయిచ్ లెనిన్. వరవరరావు జీవితంలో మాత్రం ఏ రోజూ, ఏ వారమూ, ఏ దశాబ్దమూ ఏమీ జరగకుండా, ఏదీ సంభవించకుండా పోలేదనిపిస్తుంది. ఆకలి తప్ప అన్యం తెలియని రెండేళ్ల పసితనంలోనే చుక్క చుక్క పాలు పీల్చుతూ, ‘ నా రక్తం తాగుతున్నావు కదరా’ అని బలహీనురాలయిన తల్లిచేత, నిస్సహాయమైన విదిలింపులకి గురి అయిన అనుభవాలతో సహా వరవరరావు జీవన మార్గం యావత్తూ, ఈ అరవై యేళ్లలో నానా రకాల అనుభవాలతో, పోరాటాలతో, ప్రతిఘటనలతో, ఆకాంక్షలతో, చెదరని ఆశయాలతో, తొణకని స్వప్నాలతో నిర్మాణమయింది. వరవరరావుని నేనొక epoch maker గా భావిస్తాను. ఆయన కవిత్వం, ఆయన రాజకీయాలు నా కెప్పుడూ వేరువేరుగా కనిపించలేదు. చిత్రంగా, ఆయన వయసు కూడా నాకెప్పుడూ గురుతుండదు. వరవరరావులాంటి అసాధారణ వ్యక్తులకి వృద్ధాప్యం రాదు. వాళ్లు వర్తమానానికి ఎంత సజీవులో భవిష్యత్తుకి కూడా అంతే సజీవులు. అంతే సచేతనలు.

ఎప్పటి 196869, ఎక్కడి గుంటూరు సభలు! అప్పటి నుంచి వరవరరావు (ఇక వివి)తో నా బంధం. ఆయనకేమోకానీ, నాకు మాత్రం అది బంధమే. దాదాపు యాభై యేళ్లు. ప్రజల పోరు రాజకీయాలలోకి ఆయన ఒక వెదురు విల్లంబులా దూసుకుపోవడం, ప్రజా సాహిత్య రంగంలో ఒక లైట్‌హౌస్‌గా మారిపోవడం, నేను దూరంగా ఉండి, నా గొడవ నేను పడుతూ, నా రాతలు నేను రాసుకుంటూ గమనిస్తూ ఉండిపోయాను. వివి గురించి ఇలా నాలుగు ముక్కలు రాసే సందర్భం ఒకటి నాకు యెదురవుతుందని బొత్తిగా ఆలోచించలేదు. ఆయన గురించి ఇంటర్‌వ్యూలలో మాట్లాడానుకానీ, ఆయనతో వాదన కవితలు ఒకటి రెండు రాశాను కానీ, ఇలా వివి కవిత్వం మీద వచ్చిన ఒక treatise కి ‘పరిచయ వాక్యాలు’ రాయవలసి వస్తుందని ఊహించలేదు. రాయడానికి అనంతంగా ఉంది కానీ, ఇది తగిన చోటు కాదు, ఇక్కడ ఉచితమూ కాదు.

తమ్ముడు మలుపు బాల్‌రెడ్డి ఈ ప్రతిపాదన చేయగానే మారుమాట లేకుండా నేను ‘సరే’ అనడానికి కారణం, వివి కవిత్వం గురించి ఒక లోతైన insightతో, ఆయన body of workని విశ్లేషించే ప్రయత్నంగా వస్తున్న ఈ విలువైన పుస్తకంతో ముడిపడే అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేకనే. నిజానికి వివి గురించి, రాజకీయవేత్తగా, కవిగా, ఆలోచనపరుడిగా నా అభిప్రాయాలు నాకున్నాయి. ఇలా తెలుగు సాహిత్య రంగంలోని మరికొంత మందికి కూడా వివి గురించి రకరకాల అంచనాలూ, మదింపులూ ఉండి ఉంటాయి. వీటిలో చాలా వరకు అప్రకటితాలు. పరిశోధన గ్రంథాల గురించి నాకు ఎక్కువ తెలియదు. కానీ, పాణి చేసిన ఈప్రయత్నం మాత్రం చాలా ప్రత్యేకమయిందనుకుంటున్నాను. ఇది రాస్తున్నప్పుడు చుట్టూ పరుచుకుని, నను పరివేష్టించి ఉన్న ఈ వాల్మీకి, ఈ కాళిదాసు, ఈ దాంతే, ఈ వర్జిల్, ఈ షేక్‌స్పియర్, ఈ నెరూడా, ఈ బీటిల్స్, ఈ శ్రీశ్రీ, ఈ శివసాగర్, ఈ రంజిత్ ఎస్బోటే నా వాస్తవిక ప్రపంచంలో లేనిదో, నా ఊహాలోకంలోకి రానిదో, ఈ కవులలో, ఈ రచయితలలో ఏ మున్నదా అని ఆలోచనలో పడుతుంటాను.

సుమారు 2000 పుటలలో నిక్షిప్తమై ఉన్న వివి కవిత్వానికి ఈ నక్షత్ర సముదాయంలో ఒక సముజ్వల స్థానం ఇప్పటికే స్థిరపడి ఉండాలి. దానిని పైకి లేపి పట్టి, ఆ ధగద్ధగలని ప్రపంచానికి చూపించే ప్రయత్నం పాణి ప్రారంభించాడని అనుకుంటున్నాను. వివిని ఆధునిక తెలుగు కవితా తలం మీద ఎక్కడ ఉంచి చూడాలి? ఎక్కడి నుంచి చూడాలి? ఆయన పద్య నిర్మాణ క్రమం (strophe) గురించి ఇక్కడ పాణి చేసిన పరిశీలన సరిపోతుందా? ఆయనది జాను తెనుగు జాడలున్న భాష కదా, ఆ కమ్మదనాన్ని సామాన్య పాఠకులకి ఒలిచి రుచి చూపించవలసిన అవసరం లేదా? విప్లవ కవిత్వమంటే రసలుప్త పంక్తులు కాదని మరింత ఆమోద యోగ్యంగా నిరూపించవలసిన బాధ్యత మన జనానుకూల విమర్శకులకి లేదా? ఇవి నేను ఒక వివి కవిత్వాన్ని, పాణి రాసిన ఈ విలువైన విశ్లేషణని గురించి మాత్రమే అంటున్న మాటలు కాదు. నేనొక అవసరమైన ఆలోచనని మాత్రమే వ్యక్తం చేస్తున్నాను.

పాబ్లో పికాసో తన మహత్తర చిత్రం ‘గుయెర్నికా’ (1937)ని చిత్రించి, ప్రపంచంలో కొత్త అలజడి సృష్టించిన మూడేళ్లకి జన్మించిన వివికి భారత ‘స్వాతంత్య్ర’ సంగ్రామం పతాక స్థాయికి చేరుతున్న దశాబ్దంలో ఊహ తెలిసింది. విఫలమవుతున్న విముక్తి పోరాటాలతో, విజయవంతమైన విప్లవాలు కూడా ఊగిసలాటలు పడుతున్న శంకలతో, సందేహాలతో ప్రపంచ కమ్యూనిస్టు ప్రేమికులు సతమతమవుతున్న దశ నుంచి వివి ఎదిగి వచ్చాడు. ఆటంబాంబులు వేయడానికి అమెరికా వాళ్లు హిరోషిమా నగరాన్ని ఎన్నుకోడానికి అక్కడి రాడార్ అనుకూల వినిర్మల వాతావరణం (fair weather) కూడా ఒక కారణమని ఎక్కడో చదివాను. వివి నడుస్తున్న చరిత్రతోపాటు కాలు కదిపి నడిచిన ఆలోచనాపరుడు. ప్రపంచ వ్యాప్తంగా పక్వమవుతున్న ప్రజానుకూల పోరాట కెరాటాలు పడుతూ లేవడాన్నీ, లేచి పడడాన్నీ గమనిస్తూ, భారతదేశంలో పుట్టి పెరుగుతున్న విప్లవ యోచనలలో మమేకమవడమే కాకుండా, వాటి సాహిత్య ఆవరణంలో నాయకత్వం చేపట్టి, స్వయ ంగా కవిత్వం రాసి ఉదాహరణగా నిలిచి వెలిగాడు.

అక్క హేమలత సరిగానే సంభావించినట్లు, ఉధృత కెరటాల మీద ప్రయాణించే పడవలాంటి తన సాహిత్య జీవితపు ఆరు దశాబ్దాల కాలంలో పది పన్నెండేళ్లు జైళ్లలో, అజ్ఞాతంలో గడిపిన వివి లో ఒక ప్రవాస కవి కూడా ఉన్నాడు. ఆ అజ్ఞాత, కారాగారవాస కవిత్వాన్ని ప్రత్యేకంగా ఒకచోట అచ్చు వేస్తే చూడాలని ఉంది నాకు. ఇప్పటికే పలువురు మిత్రులు వ్యాఖ్యానించినట్టు, ఆచరణాత్మక పోరాటంలో భాగం కాలేకపోయాననే చింత లోలోపల యెక్కడో ఉండి, అప్పుడప్పుడు అది నా పద్యాలలో బయటపడుతూ ఉంటుంది. అది విప్లవ వీరుల ఆరాధన స్థాయికి కూడా పోతూ ఉంటుందని కె. శ్రీనివాస్ వంటి తమ్ముళ్లు హెచ్చరికగా రాశారు. నా ఈ PANTHION లో వివి కూడా ఉన్నాడంటే మీరు నమ్ముతారా? అరణ్యాల సంగతి యేమోకాని మైదానాలలో, అంతో ఇంతో భద్ర జీవనం లభించిన తరువాతనైనా, నేను చేయవలసిందీ, చేయగలిగిందీ కూడా చేయలేకపోయాననే ‘అపరాధ భావన’ ఇలా వివి వంటి living icons పట్ల ఈ దోషమనిపించని ఆరాధన భావనకి దారి తీసి ఉంటుంది. వియత్నాం సాహిత్యంలో గెరిల్లాలు part of the natureగా మారిపోయారని శివసాగర్ చెప్పినప్పుడు, నాకు అది ఒక స్వప్నంలాగ, ఎంతో romanticగా అనిపించింది.

ఇక వివి కవిత్వం గురించి పాణి రాసింది చదివినప్పుడు, అతని అధ్యయనం, పరిశీలన, ప్రాపంచిక దృక్ప థం, చారిత్రక స్పృహ, ‘ఏకపక్ష ప్రజా కవిత్వ పక్షపాతం’ నన్ను చకితుణ్ణి చేశాయి. కె.వి రమణా రెడ్డి గారు, చేకూరి రామారావుగారు, త్రిపురనేని మధుసూదన రావు గారు గతించిన తరువాత మార్కిస్టు సాహిత్య విమర్శకులలో, aesthetics గురించీ, poetic dictionగురించీ గట్టి పునాదులున్న వారు తయారు కాలేదనే దిగులు ఉండేది. పాణి రాసిన ఈ విశ్లేషణ చూసిన తరువాత మనసు కొంత నెమ్మదించింది. పాపినేని శివశంకర్ ఒక పరిమితిలో చేయగలుగుతున్న పనిని పాణి మరింత స్పష్టమైన ప్రజాకళా తలం మీద చేయగలడనిపించింది. ఆనందవర్ధనుడు (క్రీ.శ. 820890) తన ‘ధ్వన్యాలోకం’లో కవిత్వ గుణాస్వాదన కూడా, మౌలికంగా కవిత్వ రచన వంటిదే అంటాడు.

అంటే criticismని creative సరసన, భుజం భుజం రాసుకునేలా నిలబెట్టాడన్న మాట! ఇటువంటి ‘ఆసక్తికర అన్వయాలని, గురించి మార్కిస్టు సాహి త్య పాఠశాలలలో, కార్యశాలలలో చర్చించవద్దా? అన్నట్టు, వివి యవ్వనంలో కూడా ప్రేమ కవిత్వం రాయలేదా? రాసినవి ఉన్నా తన సమగ్ర కవిత్వంలో చేర్చలేదా? నాకు తెలిసి వివికయితే, దీనిపట్ల వైముఖ్యమేమీ లేదు. ఎరవాడ జైలు నుంచి ఇటీవల నేను ఇంగ్లీషులో ‘Seeping with the Rainbow’ ప్రచురించిన ప్రేమ కవితలని గు రించి, వివి ఇంగ్లీషులో ప్రశంసలు రాసి పంపించా రు. If there were no french women, life would not be worth living’ అన్నాడు En gels. ఈ ప్రస్తావన సందర్భవశాత్తూ వచ్చిందే. వివి రాసిన అన్ని వందల పద్యాలలో ఈ పరిమళ పద్యాలు కూడా ఉండి ఉంటే హృద్యంగా ఉండేది కదా అని ఒక లౌల్యపు చిరాశ.
‘వ్యక్తిత్వమే కవిత్వం’ గ్రంధానికి రాసిన ముందుమాట నుంచి

Latest news and updates on Varavara Rao

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వివి అమృత స్పర్శ, పాణి విశాల పరామర్శ ఒక పారవశ్య ప్రతిస్పందన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: