మలింగ హ్యాట్రిక్

కొలంబో: కెప్టెన్ లసిత్ మలింగ హ్యాట్రిక్‌తో చెలరేగడంతో న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన మూడో, చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. తర్వాత సునాయాస లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ లంక సారథి మలింగ ధాటికి 88 పరుగులకే కుప్పకూలింది. మలింగ వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. […] The post మలింగ హ్యాట్రిక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కొలంబో: కెప్టెన్ లసిత్ మలింగ హ్యాట్రిక్‌తో చెలరేగడంతో న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన మూడో, చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. తర్వాత సునాయాస లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ లంక సారథి మలింగ ధాటికి 88 పరుగులకే కుప్పకూలింది. మలింగ వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో మలింగ వరుసగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. మూడో బంతికి మన్రోను, తర్వాతి బంతికి రూథర్‌ఫోర్డ్‌ను, ఐదో బంతికి గ్రాండోమ్‌ను ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. అంతేగాక నాలుగో బంతికి సీనియర్ ఆటగాడు రాస్ టేలర్‌ను ఔట్ చేసి నాలుగో వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. టి20 చరిత్రలోనే మలింగ అసాధారణ ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా కివీస్ 21తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

Lasith Malinga takes historic hat trick

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మలింగ హ్యాట్రిక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: