టి20 ర్యాంకింగ్స్‌లో మలింగ హవా

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) శనివారం తాజాగా ప్రకటించిన ట్వంటీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీలంక కెప్టెన్ లసిత్ మలింగ తన ర్యాంక్‌ను గణనీయంగా మెరుగు పరుచుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో మలింగ ఏకంగా 20 స్థానాలను మెరుగు పరుచుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో వరుస బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టిన మలింగ అరుదైన హ్యాట్రిక్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ సిరీస్‌లో అసాధారణ బౌలింగ్‌ను కనబరచడంతో మలింగ ర్యాంక్ ఎంతో మెరుగైంది. తాజా ర్యాంకింగ్స్‌లో అతను […] The post టి20 ర్యాంకింగ్స్‌లో మలింగ హవా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) శనివారం తాజాగా ప్రకటించిన ట్వంటీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీలంక కెప్టెన్ లసిత్ మలింగ తన ర్యాంక్‌ను గణనీయంగా మెరుగు పరుచుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో మలింగ ఏకంగా 20 స్థానాలను మెరుగు పరుచుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో వరుస బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టిన మలింగ అరుదైన హ్యాట్రిక్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ సిరీస్‌లో అసాధారణ బౌలింగ్‌ను కనబరచడంతో మలింగ ర్యాంక్ ఎంతో మెరుగైంది. తాజా ర్యాంకింగ్స్‌లో అతను 41వ ర్యాంక్ నుంచి 21వ స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంక వెటరన్ బౌలర్‌గా ఉన్న మలింగ కివీస్ సిరీస్‌లో అద్భుత బౌలింగ్‌తో ప్రకంపనలు సృష్టించాడు. అరుదైన హ్యాట్రిక్‌తో తనలో చేవతగ్గలేదని చాటాడు. కాగా, తాజా ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ 8వ స్థానంలో నిలిచాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కెఎల్.రాహుల్, రోహిత్ శర్మలు మాత్రమే టాప్ టెన్‌లో నిలిచారు. తాజా ర్యాంకింగ్స్‌లో రాహుల్ ఏడో స్థానంలో నిలువగా, రోహిత్ 9వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజమ్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. మాక్స్‌వెల్ రెండో, మున్రో మూడో ర్యాంక్‌లో నిలిచారు.

Lasith Malinga rises in T20I rankings after double hat trick

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post టి20 ర్యాంకింగ్స్‌లో మలింగ హవా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: