భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలి…

ఇంద్రవెల్లి: వ్యవసాయ రైతులకు చెందిన భూ సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండ వెంటనే పరిష్కరించాలని జేసీ సంధ్యారాణి అన్నారు. శుక్రవారం మండలంలోని స్థానిక రెవెన్యూ కార్యాలయాన్ని  తనిఖీ చేశారు. అనంతరం మండలంలోని రెవెన్యూ అధికారులతో పాటు విఆర్వోలతో రైతులు ఎదురుకుంటున్న భూ సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రెవెన్యూ గ్రామాల వారిగా భూ సమస్యలను అడిగితెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్నరైతు సమస్యల వివరాలను పరిశీలించి సంబంధిత విఆర్వోలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎదురుకుంటున్న చిన్నచిన్న సమస్యలను ఎందుకు […] The post భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఇంద్రవెల్లి: వ్యవసాయ రైతులకు చెందిన భూ సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండ వెంటనే పరిష్కరించాలని జేసీ సంధ్యారాణి అన్నారు. శుక్రవారం మండలంలోని స్థానిక రెవెన్యూ కార్యాలయాన్ని  తనిఖీ చేశారు. అనంతరం మండలంలోని రెవెన్యూ అధికారులతో పాటు విఆర్వోలతో రైతులు ఎదురుకుంటున్న భూ సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రెవెన్యూ గ్రామాల వారిగా భూ సమస్యలను అడిగితెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్నరైతు సమస్యల వివరాలను పరిశీలించి సంబంధిత విఆర్వోలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎదురుకుంటున్న చిన్నచిన్న సమస్యలను ఎందుకు పెండింగ్‌లో ఉంచారనేది సమాచారం ఇవ్వాలని మండ్డిపడ్డారు.

రైతులు ఎదురుకుంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. సక్షేషన్, పార్ట్(బి) విరాసత్, ఫోడు పట్టాలు, కాస్తులో పేర్లు మార్పిడి చేసేందుకు రైతులను ఇబ్బందికి గురిచేయవద్దన్నారు. మండలంలో 29 మంది రైతులకు చెందిన చిన్నచిన్న సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని వారంలోపు పరిష్కరించాలన్నారు. ఆధార్ కార్డుతో పాటు రైతుల వేలిముద్ర సరిగ పడకపోవడంతో 60 మంది రైతులకు చెందిన వివరాలను రిమేనింగ్ చేసేది ఉందన్నారు. రైతుల వారిగా పూర్తి వివరాలతోపాటు భూ సమస్యలను ధరణి వైబ్‌సైట్ లో పొందుపర్చాలన్నారు. తహసీల్దార్ పరిధిలో ఉన్న సమస్యలను వేంటనే పరిష్కరించి రైతులను ఆదుకోవాలన్నారు. తహసీల్దార్ పరిధిలో పరిష్కారం కాని సమస్యలను డివిజన్ అధికారులతోపాటు లేద జిల్లా స్థాయి అధికారులు దృష్టికి తీసుకోపోయి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.

నార్నూర్, గాదిగూడ మండలాల్లో ప్రభుత్వ భూములను గుర్తించడానికి మిషన్ సహయంతో ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తున్నామన్నారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో కుడు త్వరలోనే సర్వేలు నిర్వహించి ప్రభుత్వ భూములను గుర్తించడం జరుగుతుందన్నారు. రెవెన్యూ, పారేస్టు భూములను గుర్తించడానికి జూయింట్ సర్వేలు చేసి ఎవ్వరి భూములను వారికి  రికార్డులో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సాయన్న, డిప్యూటీ తహసీల్దార్ జాదవ్ భామ్‌రావ్, గీర్ధవార్ మెస్రం లక్ష్మణ్, విఆర్వోలు తదితరుల పాల్గొన్నారు.

Land problems should be solved

Related Images:

[See image gallery at manatelangana.news]

The post భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: