మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

హైదరాబాద్‌ : పెళ్లి ఇష్టం లేని ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  ఎల్ బి నగర్ లోని మన్సురాబాద్ లో ఈ ఘటన జరిగింది. మాదాపూర్ లోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో లక్ష్మి(27) ఇంజినీర్ గా పని చేస్తోంది. తన తల్లి, తమ్ముడితో కలిసి మన్సురాబాద్ లో నివాసం ఉంటోంది. లక్ష్మికి పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఆమె తన […] The post మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌ : పెళ్లి ఇష్టం లేని ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  ఎల్ బి నగర్ లోని మన్సురాబాద్ లో ఈ ఘటన జరిగింది. మాదాపూర్ లోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో లక్ష్మి(27) ఇంజినీర్ గా పని చేస్తోంది. తన తల్లి, తమ్ముడితో కలిసి మన్సురాబాద్ లో నివాసం ఉంటోంది. లక్ష్మికి పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఆమె తన కుటుంబ సభ్యులకు తేల్చి చెప్పింది. బుధవారం నాడు లక్ష్మికి పెళ్లి సంబంధం చూసేందుకు ఆమె కుటుంబ సభ్యులు ఓ అబ్బాయి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న లక్ష్మి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి ఇష్టం లేకనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం లక్ష్మి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఎల్ బి నగర్ పోలీసులు తెలిపారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: