కుంటాల జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తాం

Kuntala Water Falls

 

జలపాతం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాం
పర్యాటకుల సేద తీరేందుకు మరిన్ని సౌకర్యాల ఏర్పాటు
పర్యాటక శాఖ ఎండి మనోహర్

నేరడిగొండ : ప్రకృతి అందాల కుంటాల జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది పరుస్తామని పర్యాటక శాఖ ఎండీ మనోహర్ అన్నారు. శుక్రవారం కుంటాల జలపాతన్ని ఆయన సందర్శించి, జలపాతం వద్ద ప్రమాదాల నివారణ కోసం, జలపాతం వద్ద చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఎండీ సమిక్షించారు. పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని, జలపాతంపై బాగంలో వంతెనను నిర్మి ంచేందుకు సిద్దంగా ఉందని, ప్యూపాయింట్లను ఏర్పాటు చేస్తామని, పర్యాటకులకు జలపాతం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు, దగ్గర నుంచి నీటి ధారలను వీక్షించే విధంగా వేలాడే వంతెనను నిర్మించడానికి అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు ఎండీ తెలిపారు.

వంతెన నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికను రూపొందించి నిర్మాణం పనులను త్వరలో ప్రారంభిస్తామని పెర్కోన్నారు. పొచ్చెర జలపాతం వద్ద పర్యాటకుల సేద తీరేం దుకు మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు, శుద్ద నీటిని అందించే విధంగా చర్యలు చేపట్టనునట్లు తెలిపారు. ఎండీ వెంట అటవీశాఖ అధికారి కృష్ణ, కుంటాల గ్రామ సర్పంచ్ అశోక్ తదితరులు ఉన్నారు.

Kuntala Water Falls will become Tourist destination

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కుంటాల జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.