నిజాలు తెలుసుకుని మాట్లాడండి

Rekha Sharma's tweet

 

మహిళలు రాత్రి 8గం.లోపు ఇంట్లో ఉండాలని సిఎంఒ ఎటువంటి ప్రకటన చేయలేదు, రేఖాశర్మకు కెటిఆర్ ఎదురు ట్వీట్

రేఖా శర్మ ట్వీట్‌పై ఘాటుగా స్పందించిన కెటిఆర్

హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధం లేని ట్వీట్‌పై స్పందిస్తూ జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ చేసిన ట్వీట్‌పై రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ఘాటుగా స్పందించారు. కీలకమైన పదవిలో ఉన్న మీరు నిజాలు తెలుసుకుని స్పందించాలని ట్విట్టర్ వేదికగా రేఖా శర్మను ఉద్దేశించి కోరారు. మహిళలు రాత్రి 8 గంటలలోపు ఇంట్లో ఉండాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు. బాధ్యత లేని కొన్ని ఛానెళ్లు టిఆర్‌పి రేటింగ్స్ కోసం ఇలాంటి నాన్సెన్స్ ప్రచారం చేస్తున్నారని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, రేఖా శర్మ కొన్ని జాతీయ ఛానెళ్లలో ప్రసారమైన చర్చ కార్యక్రమం ఆధారంగా తెలంగాణ సిఎంఒ మహిళలు రాత్రి 8 గంటలలోగా ఇంట్లోనే ఉండాలనే ప్రకటన చేశారని పేర్కొంటూ ఇంట్లో ఉంటే మహిళలపై నేరాలు జరగవా..? నేరాలు జరుగుతాయని మహిళలు ఇంట్లో ఖైదీలుగా ఉండాలా..? బహిరంగ ప్రదేశాలలో మహిళలకు సమాన హక్కులు లేవా..? అంటూ తీవ్రంగా ట్వీట్ చేయడంతో కెటిఆర్ స్పందించి రీ ట్వీట్ చేశారు.

KTR responded strongly to Rekha Sharma’s tweet

The post నిజాలు తెలుసుకుని మాట్లాడండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.