నేనెప్పుడూ సాధారణ వ్యక్తినే

KTR

 

కేంద్ర బుగ్గ కార్లను నిషేదించక ముందు
మంత్రిగా ఉండి కూడా బుగ్గ కారును వాడలేదు
నెటిజన్ ట్వీట్‌కు బదులిచిచ్చిన కెటిఆర్

హైదరాబాద్ : గత ప్రభుత్వ హయాంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక సాధారణ వ్యక్తి మాదిరిగానే ట్రాఫిక్‌లో ప్రయాణించానని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విఐపిల కోసం వినియోగించే బుగ్గ కార్లను నిషేధించక ముందు మంత్రిగా ఉండి కూడా బుగ్గ కారును ఉపయోగించలేదని కెటిఆర్ స్పష్టం చేశారు. రాకేశ్ వర్మ అనే వ్యక్తి కెటిఆర్‌కు ట్వీట్ చేస్తూ.. సార్ మీరు పంజాగుట్ట, బంజారాహిల్స్ మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ బాగా ఉన్న సమయాల్లో కూడా ఆ ట్రాఫిక్‌లోనే ప్రయాణించారు. మీరు ప్రయాణించిన సమయంలో ఎప్పుడు కూడా ట్రాఫిక్‌ను ఆపలేదు అని ట్వీట్ చేశాడు. అందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నానని రాకేశ్ వర్మ కెటిఆర్‌కు ట్వీట్ చేయగా, రాకేశ్ వర్మ ట్వీట్‌కు కెటిఆర్ పైవిధంగా బదులిచ్చారు.

KTR replied to the Netizen Tweet

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నేనెప్పుడూ సాధారణ వ్యక్తినే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.