వికలాంగునికి ద్విచక్ర వాహనం సమకూర్చిన కెటిఆర్…

హైదరాబాద్: ఓవికలాంగునికి ద్విచక్ర వాహనాన్ని సమకూర్చి జీవితంపై భరోసాకల్పించారు టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కుత్బల్లాపూర్‌కు చెందిన సంబరబోయిన శివ ఏదైనా ఉద్యోగం చేసుకోలంటే అంగవైకల్యంతో నడవలేని పరిస్థితి ఉందని ద్విఛక్రవాహనం ఉంటే ఉద్యోగం చేసుకునే అవకాశం ఉందని తెలిపుతూ టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు వాట్సాప్‌లో విజ్ఞప్తి చేశారు. తనకు ఒకవాహనం ఇప్పించాలని అభ్యర్థించారు. సమాచారం తెలుసుకున్న కెటిఆర్ స్థానిక ఎంఎల్‌సి శంబీపూర్ రాజుకు వాహనం ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు హోండా యాక్టివా […] The post వికలాంగునికి ద్విచక్ర వాహనం సమకూర్చిన కెటిఆర్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: ఓవికలాంగునికి ద్విచక్ర వాహనాన్ని సమకూర్చి జీవితంపై భరోసాకల్పించారు టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కుత్బల్లాపూర్‌కు చెందిన సంబరబోయిన శివ ఏదైనా ఉద్యోగం చేసుకోలంటే అంగవైకల్యంతో నడవలేని పరిస్థితి ఉందని ద్విఛక్రవాహనం ఉంటే ఉద్యోగం చేసుకునే అవకాశం ఉందని తెలిపుతూ టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు వాట్సాప్‌లో విజ్ఞప్తి చేశారు. తనకు ఒకవాహనం ఇప్పించాలని అభ్యర్థించారు. సమాచారం తెలుసుకున్న కెటిఆర్ స్థానిక ఎంఎల్‌సి శంబీపూర్ రాజుకు వాహనం ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ మేరకు హోండా యాక్టివా వాహనాన్ని తన నిధులతో కొనుగోలు చేసి మంగళవారం ప్రగతిభవన్‌లో మంగళవారం కెటిఆర్‌సమక్షంలో శివకు అందింటచారు. మంత్రి మల్లారెడ్డి, శాసనమండలి సభ్యుడు శంబీపూర్ రాజు,స్థానిక శాసనసభ్యుడు వివేకనంద గౌడ్ సమక్షంలో శివకు కెటిఆర్ ద్విఛక్రవాహనం అందించారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పాలనలో అన్నివర్గాలప్రజలకు న్యాయంజరుగుతుందనడానికి ఇదో ఉదహాణ అన్నారు.

వికలాంగులకు పంచన్లు పెంచడంతో పాటు ఎక్కడికక్కడ ఆదుకుంటున్న సిఎం కెసిఆర్‌కు, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు రుణపడి ఉంటాన్నారు. ఈ సహాయంతో ఉద్యోగం చేసుకుని నాకుటంబాన్ని పోషించుకునే అవకాశం కలిగిందని చెప్పారు. ఇప్పటివరకు నడవడం సమస్యగా ఉండేది ఇప్పుడు కెటిఆర్ ఇచ్చిన వాహనంతో నాకు కొత్తనడక, కొత్తజీవితం వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.

KTR provided two wheeler for disabled person

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వికలాంగునికి ద్విచక్ర వాహనం సమకూర్చిన కెటిఆర్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: