అవ్వా పానం ఎట్లుంది?

 KTR greets old woman while opening Basti Hospital

 

బాగున్నా బిడ్డా

సిఎం కెసిఆర్ పింఛన్ ఇస్తున్నారు… నువ్వు ఆసుపత్రిని కూడా తెచ్చావ్

ఎంతమంది పిల్లలు అంటూ
ఓ వృద్దురాలిని పలకరించిన కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: అధికారిక కార్యక్రమాల్లో హుందాగా వ్యవహరిస్తూ ఎప్పడికప్పుడు ఉత్తర్వులను జారీచేస్తూ పాలవ్యవస్థను చక్కదిద్దే రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రజాక్షేత్రంలో సామాన్యప్రజలతో కలిసిపోతారు.

గత పర్యటనల్లో తారాస పడినవారిని పేరుపెట్టి పిలుస్తూ యోగక్షేమాలు అడుగుతారు. అధికారిక మావేశాలకు, పార్టీ కార్యక్రమాలకు, ప్రజాక్షేత్రపర్యటనల్లో కెటిఆర్ పూర్తి వ్యత్యాసంతో ఉంటారు. ప్రజలతో కలిసిపోయి కార్యక్రమాలు నిర్వహిస్తారు. తాజాగా శుక్రవారం బస్తీ దావఖానల ప్రారంభోత్సవాల్లో ప్రజలను పలకరిస్తూ కెటిఆర్ ముందుకు కదిలారు. కెటిఆర్ పలకరింపుతో ప్రజలు మరింత ఆనందపడ్డారు. వెంగళరావు బస్తీదావఖాన ప్రారంభోత్సవంలో కెటిఆర్ ఓ అవ్వాను బాగున్నావా? పానం ఎలాఉంది అంటూ పలకరించారు.

ఆవృద్దురాలి యోగక్షేమా లు అడిగి తెలుసుకున్నారు. పిల్లలు ఎంత మంది? ఎలా ఉన్నారు అంటూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అవ్వతక్షణం స్పందిస్తూ బిడ్డాబాగున్నాను, సిఎం సార్ ఇస్తున్న పింఛన్ అందుతుంది. అయితే ప్రస్తుతం బయటకు వెళ్లడం ఇబ్బందిగా ఉంది. పానం సుస్తిగా ఉంది. బిపి షుగర్ ఉంది అని అవ్వ చెప్పారు. వెంటనే కెటిఆర్ మాట్లాడుతూ పెద్దమ్మ నీకు ఎంత మంది పిల్లలని అడిగారు. బిడ్డా నాకు ఐదుగురు కొడుకులు అయితే ఎవరూ నన్నుచూసుకోవడంలేదు అని చెప్పారు. ఫించన్‌తో బతుకుతున్నాను అన్నారు.

అయితే ఇప్పటి వరకు ఏ ఆసుపత్రిలో చూపించుకున్నావని కెటిఆర్ అడగగా బోయినపల్లి ఆసుపత్రిలో నని అవ్వా సమాధానం చెప్పారు. పెద్దమ్మ ఇక నుంచి నువ్వు బోయినపల్లికి ఆసుపత్రికి వెళ్లకు. ఇక్కడే ఆసుపత్రిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డాక్టర్లుకూడా ఉంటారు. ఆరోగ్యం జాగ్రతని కెటిఆర్ చెప్పారు. అలాగే బిడ్డా ఇక్కడే చూపించుకుంటానని ఆప్యాయంగా ఆ తల్లి చెప్పడంతో కెటిఆర్ సంతోషంతో వ్యక్తం చేశారు.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అవ్వా పానం ఎట్లుంది? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.