పౌరులే పాలకులు

అవినీతి రహితంగా, పారదర్శకంగా పౌరసేవలు అందించాలి

పౌరుల ఆకాంక్షల మేరకు పనిచేయాలి
వారి భాగస్వామ్యంతో పట్టణాలలో మార్పు కోసం టీంవర్క్‌తో పనిచేద్దాం
– కొత్తచట్టంపై సదస్సులో మున్సిపల్ కమిషనర్లతో మంత్రి కెటిఆర్

తాము పనిచేస్తున్న పట్టణంలో మార్పు వచ్చేలా ప్రతి ఒక్క మున్సిపల్ కమిషనర్ పనిచేయాలి. పురపాలనలో విస్తృతమైన అనుభవం ఉన్న కమిషనర్లు… చట్టంలో లేని వినూత్నమైన పద్ధతుల్లో పనిచేసి పట్టణాలకు మరింత శోభ తీసుకువస్తామంటే మద్దతిస్తా. ఇప్పటికే రాష్ట్రంలో సిద్దిపేట, సిరిసిల్ల, వరంగల్, సూర్యాపేట, పిర్జాదీగూడా వంటి మున్సిపాలిటీలు వివిధ అంశాల్లో జాతీయస్థ్ధాయిలో గుర్తింపు పొందేలా పనిచేస్తున్నాయి. వాటిని పరిశీలించాలి. జాతీయస్థ్ధాయిలో పురపాలనలో వినూత్నమైన,
అదర్శవంతమైన పద్ధ్దతులను అనుసరిస్తున్న పట్టణాలను అధ్యయనం చేసేందుకు వెళ్తామంటే పంపిస్తా.

మన తెలంగాణ/హైదరాబాద్ :పురపాలనలో పౌరుడే పాలకుడని, ఇదే నూతన పురపాలక చట్టం స్పూర్తి అని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. రెండు రోజుల పాటు నూతన పురపాలక చట్టంపైన ఆ శాఖ, మున్సిపల్ కమిషనర్లతో జిహెచ్‌ఎంసి కా ర్యాలయంలో ని ర్వహించిన వర్క్‌షాపు ముగింపు కార్యక్రమానికి ఆ యన హాజరయ్యారు. పాత చట్టంతో పొల్చితే నూత న చట్టంలో వచ్చిన సంస్కరణలు, మార్పులు, నిబంధనలపైన పురపాలక శాఖ నిపుణులతో టౌన్ ప్లాని ంగ్, రాబడులు, పాలన సంస్కరణల వంటి అంశాలపైన ఈ సదస్సులో చర్చించారు. సదస్సు ముగింపు సమావేశానికి హాజరైన మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, పురపాలనలో ప్రభుత్వం విజన్‌పైన కమిష నర్లకు దిశానిర్ధేశం చేశారు. ప్రజలకు పౌ రసేవలను పారదర్శకంగా, అవినీతికి తావులేకు ండా వేగంగా అందించడమే లక్ష్యంగా ప్రభు త్వం నూతన చట్టాన్ని రూపొందించిందని కెటిఆర్ తెలిపారు. ప్రజలకోసం, పౌర సేవల కో సం, పాలనా సౌలభ్యం కోసం నూతన చట్టం ప నిచేస్తుందని తెలిపారు. వ్యక్తి కేంద్రీకృతంగా ఉన్న పాత చట్టం స్ధానంలో వ్యవస్ధ కేంద్రీకృతం గా నూతన పురపాలక చట్టం తీసుకువచ్చామన్నారు.

ప్రజలతో మమేకమై తన రాజకీయ జీవితాన్ని సాగిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలకు అవసరమైన పలు సంస్కరణలను ఈ చట్టం ద్వారా తీసుకువచ్చారు. 75 గజాలలోపు ఇంటి నిర్మాణానికి అనుమతులు అవసరం లేకుండా చేయడం, భవన నిర్మాణాల కోసం సెల్ఫ్ సర్టిఫికేషన్ వంటి నూతన నిబంధనలు ఇలాంటి స్పూర్తిలోంచి వచ్చినవే అని మంత్రి తెలిపారు. అందరం కలిసి నూతన పురపాలక చట్టం స్పూర్తిని కొనసాగిస్తూ దాన్ని అమలు చేద్దాం అన్నారు. పరిపాలనా ఫలాలు, సంక్షే మ, అభివృద్ది కార్యక్రమాలను మరింతా మెరు గ్గా ప్రజలకు అందించేందుకు మున్సిపల్ కమిషనర్లు పనిచేయాలని మంత్రి కోరారు. ప్రణాళిక పట్టణాభివృద్దికి ప్రతి ఒక్కరం కలిసి పనిచేద్దామని మంత్రి పురపాలక శాఖాధికారులకు పిలుపునిచ్చారు. ప్రజలు కోరుకుంటున్న పారిశుద్ధం, గుడ్ గవర్నెన్సు, వేగవంతమైన, పారదర్శకమైన పాలనను అందించేందుకు కలిసి ముందుకు సాగుదామన్నారు. పురపాలనా ఫలాలు ప్రజలకు చేరాలంటే ఒక్కరితోనే సాద్యం కాదని, ఒక టీంగా ముందుకుపోదామన్నారు. వారం రోజుల్లో మున్సిపల్ కమిషనర్లు తమ సిబ్బందితోనూ నూతన మున్సిపల్ చట్టంపైన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

తాము పనిచేస్తున్న పట్టణంలో మార్పు వచ్చేలా ప్రతి ఒక్క మున్సిపల్ కమిషనర్ పనిచేయాలని కోరారు. పురపాలనలో విస్తృతమైన అనుభవం ఉన్న కమిషనర్లు… చట్టంలో లేని వినూత్నమైన పద్దతుల్లో పనిచేసి పట్టణాలకు మరింత శోభ తీసుకువస్తామంటే తాను మద్దతు ఇస్తానని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో సిద్దిపేట, సిరిసిల్లా, వరంగల్, సూర్యాపేట, ఫీర్జాదీగూడా వంటి మున్సిపాలిటీలు వివిధ అంశాల్లో జాతీయస్ధాయిలో గుర్తింపు పొందేలా పనిచేస్తున్నాయని, వాటిని పరిశీలించాలని మంత్రి కమిషనర్లను కోరారు. దీంతోపాటు జాతీయస్ధాయిలో పురపాలనలో విన్నూతమైన, అదర్శవంతమైన పద్దతులను అనుసరిస్తున్న పట్టణాలను అధ్యయనం చేసేందుకు వేళ్తామంటే పంపుతామని తెలిపారు. పురపాలనలో టెక్నాలజీ వినియోగం ద్వారా పారదర్శకత మరింత పెరుగుతుందన్న మంత్రి, సామాజిక మాద్యమాలను సైతం వినియోగించుకుంటూ ప్రజల భాగసామ్యాన్ని పెంచాలన్నారు.

ప్రతి మూడు నెలలకోసారి రాష్ట్రస్థాయిలో మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహిస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. వివిధ అంశాల్లో ఉత్తమ సేవలు అందించిన పురపాలక సంఘాల కమిషనర్లకు మంత్రి పురస్కారాలను అందించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహాన్, ఉపమేయర్ బాబా ఫసియోద్దీన్, ఎంఎల్‌ఎ శంకర్ నాయక్, ఎంఎల్‌సి భాను ప్రసాదరావు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కూమార్, సిడియంఏ శ్రీదేవి, జియచ్ యంసి కమిషనర్ లోకేష్ కూమార్ తదితరులు ఉన్నారు.

KTR Comments On New municipal law

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పౌరులే పాలకులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.