ఐటి చూపు మన వైపే

    త్వరలోనే బెంగళూర్‌ను అధిగమిస్తుంది  హైదరాబాద్ తూర్పువైపు అభివృద్ధి చెందేలా లుక్ ఈస్ట్ పాలసీ తెస్తాం  రియల్ ఎస్టేట్ కన్సెల్టింగ్ కంపెనీ ప్రారంభిస్తూ కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఐటి కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు అన్నారు. అన్ని విధాలా అనుకూలతలున్న హైదరాబాద్ ఐటి రంగంలో మరింత అభివృద్ధి చెందడం ఖాయమని ధీమావ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం సుస్థిరమైన టిఆర్‌ఎస్ పాలనలో అన్ని రంగాల్లో దూసుకెళుతోందన్నారు. బుధవారం రాయదుర్గంలోని నా […] The post ఐటి చూపు మన వైపే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

  త్వరలోనే బెంగళూర్‌ను అధిగమిస్తుంది
 హైదరాబాద్ తూర్పువైపు అభివృద్ధి చెందేలా లుక్ ఈస్ట్ పాలసీ తెస్తాం
 రియల్ ఎస్టేట్ కన్సెల్టింగ్ కంపెనీ ప్రారంభిస్తూ కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఐటి కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు అన్నారు. అన్ని విధాలా అనుకూలతలున్న హైదరాబాద్ ఐటి రంగంలో మరింత అభివృద్ధి చెందడం ఖాయమని ధీమావ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం సుస్థిరమైన టిఆర్‌ఎస్ పాలనలో అన్ని రంగాల్లో దూసుకెళుతోందన్నారు. బుధవారం రాయదుర్గంలోని నా లెడ్జ్ సిటీలో జెఎల్‌ఎల్ కంపెనీ ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీని కెటిఆర్ ప్రా రంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, భౌగోళికంగా, వాతావరణ పరంగా, మౌళిక వసతుల పరంగా అనుకూలతలున్న హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తోందని అన్నా రు. నగరంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఎప్పటిలాగానే అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోందని పేర్కొన్నారు. ఆఫీస్ స్పేస్‌తోపాటు, గృహ ని ర్మాణ రంగంలోనూ హైదరాబాద్‌లో మార్కెట్ వాల్యూ అంతకంతకూ పెరుగుతోందని చెప్పా రు.

హైదరాబాద్ నగరంలో ఐటి అభివృద్ధి, అం దుకు తగిన మౌళిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్ర భుత్వం చేస్తున్న కృషిని కెటిఆర్ ఈ సందర్భగా వివరించారు. భవిష్యత్‌లో ఐటి ఎగుమతుల్లో హైదరాబాద్ నగరం బెంగళూర్‌ను అధిగమిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2014లో నగరంలో ఐటి ఎగుమతులు రూ. 52 కోట్లు ఉంటే, ప్రస్తు తం లక్షా 9 వేల కోట్ల రూపాయలకు పెరిగిందని గుర్తు చేశారు. పెరుగుతున్న అభివృద్ధికి తగ్గట్టుగా హైదరాబాద్‌లో మౌళిక వసతులను కల్పించడం ఎంతో కీలకమని, ప్రభుత్వం ఆ దిశగా ఎంతో కృషి చేస్తుందని వెల్లడించారు. హైదరాబాద్ నగరం తూర్పు వైపు కూడా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా లుక్ ఈస్ట్ పాలసీని తీసుకొస్తామని కెటిఆర్ తెలిపారు. తూర్పు వైపున ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తామని చెప్పారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వినియోగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం నగరంలో 36 శాతం మంది మాత్రమే ప్రజా రవాణాను వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. అటు రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటి శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, జెఎల్‌ఎల్ కంపెనీ ప్రతినిదులు పాల్గొన్నారు.

KTR Begins Real Estate Consulting Company

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఐటి చూపు మన వైపే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: