సరోగసీ మదర్‌గా…

  ‘వన్… నేనొక్కడినే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతిసనన్ ఇక్కడ పెద్దగా స్టార్‌డమ్ దక్కించుకోలేక పోయింది. ఈ సినిమా తర్వాత నాగచైతన్యతో ఓ సినిమాలో నటించింది. కానీ ఈ రెండు సినిమాల ఫలితాలు ఈ పొడుగు కాళ్ల సుందరికి ఆశించిన విధంగా కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. అక్కడా మొదట్లో కెరీర్‌ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడింది కృతిసనన్. కానీ ‘లొక్కా చుప్పి’ సినిమాతో ఈ భామ దశ తిరిగిపోయింది. ఈ సినిమాతో తొలిసారి […] The post సరోగసీ మదర్‌గా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

‘వన్… నేనొక్కడినే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతిసనన్ ఇక్కడ పెద్దగా స్టార్‌డమ్ దక్కించుకోలేక పోయింది. ఈ సినిమా తర్వాత నాగచైతన్యతో ఓ సినిమాలో నటించింది. కానీ ఈ రెండు సినిమాల ఫలితాలు ఈ పొడుగు కాళ్ల సుందరికి ఆశించిన విధంగా కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. అక్కడా మొదట్లో కెరీర్‌ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడింది కృతిసనన్. కానీ ‘లొక్కా చుప్పి’ సినిమాతో ఈ భామ దశ తిరిగిపోయింది. ఈ సినిమాతో తొలిసారి హిట్ టేస్ట్ చూసిన కృతిసనన్ ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘హౌస్ ఫుల్ 4’ తదితర సినిమాలతో వరుసగా హిట్లు, వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ జోరుగా కెరీర్‌ని నడిపించేస్తోంది. ఇక ప్రస్తుతం ఆమె నటించిన ‘మిమి’ చిత్రం తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది.

రియలిస్టిక్ స్టోరీ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో కృతిసనన్ సరోగసీ మదర్‌గా కనిపించనుంది. ఈ పాత్ర కోసం ఏకంగా 15 కేజీల బరువు పెరిగిందట. ఆ పెరిగిన బరువును తగ్గించుకునేందుకు ఇప్పుడు చాలా కష్టపడుతోందట. ఆమె స్పెషల్ డైట్‌ని తీసుకుంటోందని తెలిసింది. ఇంతవరకూ డైటింగ్ జోలికి వెళ్లని కృతి తన ఫిజిక్‌ని ఇదివరకటి షేప్‌లోకి తెచ్చుకునేందుకు నానా తంటాలు పడుతోంది. తనకి ఎంతో ఇష్టమైన కొన్ని ఫుడ్ ఐటమ్స్‌ని మానేయాల్సి వస్తోందనీ చెబుతోంది ఈ భామ. ప్రస్తుతం అక్షయ్‌కుమార్‌తో కలిసి కృతిసనన్ ఓ సినిమాలో నటిస్తోంది.

 

Krithi sanon will be seen as Surrogacy Mother

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సరోగసీ మదర్‌గా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: