ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

  ఖమ్మం : కృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని ఖమ్మం నగరంలో ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులు పలు వేషదారణలతో ఎంతో ఆకట్టుకున్నారు. ముద్దులొలికే చిన్నారుల హావభావ విన్యాసాలతో పా ఠశాల యాజమాన్యంతో పాటు ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను మైమరపించారు. హార్వెస్ట్ పాఠశాలలో… కృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం హా ర్వెస్ట్ ప్రైమరీ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనం గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రవిమారత్, ప్రిన్సిపాల్ పార్వతిరెడ్డి, ప్రైమరీ హెచ్ ఎం అరుణ దీప్తి, ఉపాధ్యాయులు […] The post ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఖమ్మం : కృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని ఖమ్మం నగరంలో ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులు పలు వేషదారణలతో ఎంతో ఆకట్టుకున్నారు. ముద్దులొలికే చిన్నారుల హావభావ విన్యాసాలతో పా ఠశాల యాజమాన్యంతో పాటు ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను మైమరపించారు.

హార్వెస్ట్ పాఠశాలలో…
కృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం హా ర్వెస్ట్ ప్రైమరీ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనం గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రవిమారత్, ప్రిన్సిపాల్ పార్వతిరెడ్డి, ప్రైమరీ హెచ్ ఎం అరుణ దీప్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా హార్వెస్ట్ టెండర్ రూట్స్‌లో కూడా కృష్ణాష్టమి వే డుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెండర్ రూ ట్స్ హెచ్‌ఎం టి. కవిత, అకాడమిక్ ఇంచార్జ్ ఉషశ్రీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

త్రివేణిలో పాఠశాలలో…
త్రివేణి పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించామని త్రివేణి పాఠశాల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీ రేంద్రచౌదరి తెలిపారు. ప్రిన్సిపాల్ పి. రాజేంద్రప్రసాద్ పూజ కార్యక్రమాలు నిర్వహించగా, వి ద్యార్ధిని, విద్యార్థు లు శ్రీకృష్ణుడు, గోపికల వేషదారణలో పాల్గొన్నారు. కార్యక్రమంలో త్రివేణి, కృష్ణవేణి పాఠశాలల డైరెక్టర్ వై. వెంకటే శ్వరరావు, ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, అకాడమిక్ ఇంచార్జ్ ముస్తాఫా, కిడ్స్ ఇంచార్జ్ శ్రీ దేవి, క్యాంపస్ ఇంచార్జ్ చార్లెస్, ట్రాన్స్‌ఫోర్టు ఇంచార్జ్ సం దీప్, ఉపాధ్యాయులు, విద్యార్ధిని, విద్యార్ధులు పాల్గొన్నారు.

బొమ్మ పాఠశాలలో…
నగరంలోని బొమ్మ పాఠశాలలో శుక్రవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బొమ్మ రాజేశ్వరరావు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల విద్యార్ధులకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బొమ్మ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ బొమ్మ సత్య ప్రసాద్, ప్రిన్సిపాల్ అజీమ్ పాషా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఖమ్మంలోని శ్రీనివాసనగర్‌లో …
గల ఎస్‌వీఎం రెజొనెన్స్ స్కూల్‌లో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు కృష్ణుని వేషదారణలో అలంకరించుకుని సంబరాలు చేశారు. బాలికలు గోపికల వేషదారణలో అలంకరించుకుని కేరింతలు కొట్టారు. ఈ కార్యక్రమం అత్యంత అద్భుతంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్నారులు కేరింతలు కొడుతూ ఉట్టి కొట్టారు. ఒక్కసారిగా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం విద్యార్ధిని, విద్యార్ధులు ఉత్సాహ భరితంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వీఎం రెజొనెన్స్ పాఠశాల డైరెక్టర్స్ ఆర్‌వీ నీలిమ, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్ధిని, విద్యార్ధులు పాల్గొన్నారు.

ఇల్లందు టౌన్‌లో… పట్టణంలోని 14 నెంబర్‌బస్తీలో గల ఎమ్‌ఆర్‌జి నారాయణ హైస్కూల్, ఇందిరానగర్‌లోని కాకతీయ హైస్కూల్ నందు శుక్రవారం క్రిష్టాష్టమి వేడుకులను పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో విద్యార్ధులు క్రిష్ణుడి వేశాధారణలో సాంప్రదాయ దుస్తులను ధరించి అందరిని అలరించారు. అనంతరం విద్యార్ధులు క్రిష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకోని ఉట్టి కొడుతు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. ఈ వేడుకలలో పాఠశాలల కరస్పాండెంట్‌లు ఒంగూరి శ్రీనివాస్‌రావు, దండి రామచందర్, ఉపాధ్యాయులు సురేష్, మంజుల, రేణుక, భాగ్యలక్ష్మి, సునీతలు పాల్గొన్నారు.

మణుగూరులో.. మండల వ్యాప్తంగా క్రిష్టాష్టమి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గోని స్వామివారి దర్శించుకున్నారు. పట్టణంలోని ప్రవేటు పాఠశాలలో విధ్యార్ధులతో శ్రీక్రిష్ణుడిగా, గోపికలుగా చిన్నారుల వేశదారణ పలువురిని ఆకట్టుకుంది. క్రిష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకోని పట్టణంలోని శ్రీవిద్య స్కూల్‌లో కరస్పాండెంట్ నూకారపు రమేష్ ఆద్వర్యంలో చిన్నారులతో ఉట్టికోట్టించి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదేవిదంగా పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్, ఎస్‌ఆర్‌కె హై స్కూల్ నందు మిని గోకులాన్ని ఎర్పాటు చేసి గోపాలుడి పాటలకు గోపికలతో నృత్యాలు చేయించి పండుగ ఆసాంతం ఆహ్లదంగా జరుపుకున్నారు.

ఖమ్మం కల్చరల్‌లో.. శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినం అయిన కృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం ఖమ్మం నగరంలో ఘనంగా జరుపుకున్నారు. ప్రధాన కార్యక్రమం నర్తకి థియేటర్ రోడ్‌లోని శ్రీమురళీకృష్ణ మందిరంలో జరిగింది. ఇక్కడ ఉదయం నుండి రాత్రి వరకు నిరంతరంగా జన్మాష్టమి వేడుకలను నిర్వహించారు. ఉదయం గోపూజ, 108 కలశాలతో పంచామృతాభిషేకం, విష్ణుసహస్రనామ పారాయణం, శ్రీకృష్ణ తులాభారం ప్రారంభం, సామూహిక విశేష తులసార్చన, మధ్యాహ్నం మహాప్రసాదాల నివేదన, సాయంత్రం సంకీర్తన విభావరి, రాత్రి 8 సంవత్సరాలలోపు వయస్సు గల బాల బాలికలకు శ్రీకృష్ణవేషధారణ పోటీలు, ఉట్లు కొట్టుట, భక్తిరంజని, మధుర నుండి కన్నయ్యను భజనలతో బృందావనానికి తీసుకుని వచ్చుట, శ్రీకృష్ణవిగ్రహం లక్కీడీప్, డోలాహరణం, ప్రత్యేక దర్శ నం, మహామంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి తెలిపారు. సుందర్ సత్సంగ్ ఖమ్మం వారి శాఖ వారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించామని చెప్పారు.

ప్రకాష్‌నగర్ శ్రీకృష్ణసాయి ఆలయంలో…
ప్రకాష్‌నగర్ శ్రీకృష్ణసాయి అభయ ఆంజనేయ దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించినట్లు ఆలయ అర్చకులు ఇంగువ అజయ్‌కుమార్ శర్మ తెలిపారు. ఉద యం గోపూజ, సామూహిక పంచసూక్తాలు, పంచామృతాలతో అభిషేకం, సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్ర పా రాయణం, సహస్రనామార్చన, సామూహిక లక్ష్మీ అష్టోత్త ర కుంకుమపూజలు సాయంత్రం గ్రామ సేవ, ఉట్టికొట్టు ట, రాత్రి స్వామివారికి పవళింపు సేవ తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు చెప్పారు. మధురానగర్ శ్రీకృష్ణమందిరం, రంగనాయకుల గుట్ట శ్రీకృష్ణసాయి ఆశ్రమంలో కూడా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అరవిందా పాఠశాలలో చిన్ని కృష్ణుల వేషధారణలు..
ఖమ్మం నగరంలోని శ్రీనగర్ కాలనీలోని అరవిందా పాఠశాలలో కృష్ణాష్టమి సందర్బంగా శుక్రవారం చిన్నారులకు కృష్ణవేషధారణలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ అమీన్‌పాషా తెలిపారు. విద్యార్దులకు కృష్ణాష్టమి పండుగ విశిష్టతను, కృష్ణుని జన్మవృత్తాంతం గురించి వివరించి చెప్పినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ అడ్వయిజర్ నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పున్నయ్య, రబ్బానీపాషా, మహబూబ్‌పాషా, హబీబ్, రవీంద్రాచారి, సంతోష్, సరిత, షమీమ్, సురేఖ, పాహిమా, సరోజిని, నాగసుధ, శాంతి, నజియా తదితరులు పాల్గొన్నారు.

Krishnashtami celebrations

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: