గలగలా కృష్ణమ్మ

Krishna River

 

మక్తల్ : మక్తల్ నియోజకవర్గంలోని తంగిడి మీదుగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ జూరాలకు పరిగెత్తుకొస్తుంది. కొంచెం కొంచెంగా పెరుగుతున్న వరద, జాలర్లు, పశు కాపరులు నదిలోకి వెళ్లొద్దని ఇప్పటికే జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధికారులను అప్రమత్తం చేశారు. గత నాలుగు రోజుల నుండి మహారాష్ట్ర , కర్నాటక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీ వరద ఎగువన ఉన్న ప్రాజెక్టులు నిండటంతో ఆల్మట్టి ప్రాజెక్టు దాటి నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 18 గేట్లు ద్వారా ఒక లక్ష రెండు వేల క్యూసెక్కుల నీటివిడుదల ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వైపు పరవళ్లు పెడుతూ వస్తుంది.

నెల రోజుల నుండి ఎదురు చూస్తున్న రైతన్నలకు జూరాల వరద నీరు వస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. నారాయణపూర్ వరద రావడంతో జూరాల ప్రాజెక్టు 1.985 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా మూడు టీఎంసీల పెరిగితే రేపు జూరాల విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి విడుదల జూరాల ప్రాజెక్టు నుండి కోయిల్‌సాగర్ ,రామన్‌పాడు , నెట్టెంపాడు, బీమా ఎత్తిపోతల పథకాలకు రైతులకు కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తారు. వరద నీరు ఎంత వరకు వచ్చి జూరాల ప్రాజెక్టు ఎంత వరకు నిండుతోందో వేచి చూడాలి.

Krishna River runs to the Juraala Project

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గలగలా కృష్ణమ్మ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.