లోక్ సభ ఎన్నికల్లో అఖండ విజయం టిఆర్ఎస్ దే

చేగుంట (మెదక్ ) : ఈ లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ 16 స్థానాల్లో అఖండ విజయం సాధిస్తుందని మెదక్ టిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  కేంద్రంలో తెలంగాణ ప్రజల తడాకాఖా చూపాలన్నా, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలన్నా సిఎం కెసిఆర్ చెప్పిన విధంగా  తెలంగాణలో మొత్తం 16 సీట్లు గెలవాలని ఆయన ప్రజలను కోరారు. ఆదివారం  నార్సింగి మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో ప్రభాకర్‌రెడ్డి పాల్గొని […] The post లోక్ సభ ఎన్నికల్లో అఖండ విజయం టిఆర్ఎస్ దే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చేగుంట (మెదక్ ) : ఈ లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ 16 స్థానాల్లో అఖండ విజయం సాధిస్తుందని మెదక్ టిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  కేంద్రంలో తెలంగాణ ప్రజల తడాకాఖా చూపాలన్నా, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలన్నా సిఎం కెసిఆర్ చెప్పిన విధంగా  తెలంగాణలో మొత్తం 16 సీట్లు గెలవాలని ఆయన ప్రజలను కోరారు. ఆదివారం  నార్సింగి మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో ప్రభాకర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు.  కాళేశ్వరం ప్రాజెక్టు 70 శాతం పూర్తి అయ్యిందని మరో 30 శాతం పూర్తి కావాలంటే నిదుల కోసం కేంద్రపై వత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో కెసిఆర్ చక్రం తిప్పాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. నార్సింగ్  మండలంలో చాలా సమస్యలు ఉన్నాయని,  రోడ్డు దాటాలంటే జాతీయ రహదారిపై అండర్ ప్రాసెస్ బ్రిడ్జి అవసరమని, ఈ బ్రిడ్జిని  మంజూరు  చేయించే బాద్యత తీసుకుంటానని ఆయన తెలిపారు.  చేగుంట ( రెడ్డిపల్లి), నాగుల పల్లి,జప్తి శివునూర్ గ్రామాల్లో కూడా అండర్ ప్రాసెస్ అవసరమని చెప్పారు. తనను ఆశీర్వదించి డిల్లీకి పంపితే ప్రజల సమస్యలపై , తెలంగాణ సమస్యలపై డిల్లీలో పోరాడి నిధులు తెస్తానని ఆయన హామీ ఇచ్చారు.

నార్సింగి మండల అబివృద్దికి ప్రత్యేక కృషి : ఎమ్మెల్యే రామలింగారెడ్డి

కొత్తగా ఎర్పాటు చేసుకున్న నార్సింగి మండల అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలిపారు. ఆదివారం రోజు నార్సింగిలో ఎన్నికల రోడ్ షోలో భాగంగా ప్రజల ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోనే చిన్న మండలం నార్సింగి అని, ఈ మండలం అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ 16 స్థానాల్లో విజయం సాధిస్తే, ఢిల్లీ నుంచి నిధులు రాబట్టుకోవచ్చని, తద్వారా తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని ఆయన కొనియాడారు. రైతు బంధు, రైతు బీమాతో రైతుల జీవితాల్లో కెసిఆర్ వెలుగులు నింపారని ఆయన చెప్పారు.  మెదక్ టిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బక్కి వెంకయ్య, రాజమౌళి పంతులు, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి,మల్లేశ్ యాదవ్, చేగుంట ఉమ్మడి మండల టిఆర్ఎస్  అధ్యక్షుడు  తాడెం వెంగళ్‌రావు. యంపీపీ కొత్త ప్రబాకర్‌రెడ్డి,ఉపాధ్యక్షుడు మల్లేశంగౌడ్, నార్సింగి సర్పంచ్ ఎర్రం అశోక్,ఎంపిటిసిలు సులోచన, సత్యం, సొసైటీ చైర్మన్ తౌర్యా నాయక్,టెలికం బోర్డు మెంబర్ వేణుగొపాల్ పంతులు, చేగుంట సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు కుమ్మరి నర్సింలు,శ్రీపతిరావ్, అచనూరి రాజేశ్, కుమ్మరి బాబు, వెంకటి, భూపతి, రెడ్డి, రాజేందర్‌రెడ్డి, బిఖ్య, ఎన్నం లింగారెడ్డి,రబ్బాణి,శంకర్‌గౌడ్, అంజిరెడ్డి,సత్యం, బాగ్యరాజ్, మక్కరాజిపేట రాజు, రాములుగౌడ్, రణం శ్రీనివాస్,జాగృతి సబిత,మ్యాకల పరమేశ్,క్రాంతి,నరేశ్, లింగరాములు తదితరులు పాల్గొన్నారు.

Kotha Prabhakar Reddy Road Show in Nursing

Related Images:

[See image gallery at manatelangana.news]

The post లోక్ సభ ఎన్నికల్లో అఖండ విజయం టిఆర్ఎస్ దే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: