విఆర్‌ఒకి రూ.4లక్షలు లంచం

ఎసిబి వలలో కొందుర్గు విఆర్‌ఒ మన తెలంగాణ/హైదరాబాద్‌ః పాసుపుస్తకాలను ఆన్‌లైన్‌లో ఉంచేందుకు రైతు నుంచి రూ.4లక్షలు లంచం తీసుకుంటూ బుధవారం కొందుర్గు విఆర్‌ఒ అంతయ్య ఎసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఎసిబి డిఎస్‌పి సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కేశంపేట మండలంలోని దత్తాయపల్లి గ్రామానికి చెందిన రైతు మామిడిపల్లి చెన్నయ్యకు సర్వే నంబరు 85/ఎలో 9 ఎకరాల 7 గుంటల పొలం ఉంది. గత నెల మెదటి వారంలో డిజిటల్ పాస్‌పుస్తకాల కోసం […] The post విఆర్‌ఒకి రూ.4లక్షలు లంచం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఎసిబి వలలో కొందుర్గు విఆర్‌ఒ

మన తెలంగాణ/హైదరాబాద్‌ః పాసుపుస్తకాలను ఆన్‌లైన్‌లో ఉంచేందుకు రైతు నుంచి రూ.4లక్షలు లంచం తీసుకుంటూ బుధవారం కొందుర్గు విఆర్‌ఒ అంతయ్య ఎసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఎసిబి డిఎస్‌పి సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కేశంపేట మండలంలోని దత్తాయపల్లి గ్రామానికి చెందిన రైతు మామిడిపల్లి చెన్నయ్యకు సర్వే నంబరు 85/ఎలో 9 ఎకరాల 7 గుంటల పొలం ఉంది. గత నెల మెదటి వారంలో డిజిటల్ పాస్‌పుస్తకాల కోసం ఆ రైతు విఆర్‌ఒ ఎం.అంతయ్యను సంప్రదించాడు. వారం రోజుల తర్వాత తనను కలవాల్సిందిగా వీఆర్వో సూచించడంతో రైతు మళ్లీ జూన్ 18న సంప్రదించాడు. పట్టా పాసుపుస్తకాలను రైతుకు అందజేసిన విఆర్‌ఒ భూమి వివరాలను మాత్రం ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండా ఉంచాడు. ఈ విషయాన్ని గమనించిన రైతు చెన్నయ్య మరోసారి విఆర్‌ఒ వద్దకు వెళ్లి అడగ్గా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలంటే తనకు రూ.3లక్షలు, ఎంఆర్‌ఒ లావణ్యకు రూ.5 లక్షలు వెరసి మొత్తం రూ.8లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు.

దీంతో అవాక్కయిన రైతు ఈ విషయాన్ని ఎసిబి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఎసిబి అధికారుల బృందం వారం రోజులుగా విఆర్‌ఒ కదలికలపై నిఘా ఉంచారు. ఈక్రమంలో ఎట్టకేలకు బుధవారం కొందుర్గు ఎంఆర్‌ఒ కార్యాలయం ఎదురుగా ఉన్న మల్లేష్ కూల్‌డ్రింక్స్ షాపు వద్ద రూ.4లక్షలు రైతు చెన్నయ్య నుంచి విఆర్‌ఒ అంతయ్య తీసుకుంటుండగా అక్కడే మాటువేసిన ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఎంఆర్‌ఒ లావణ్య ఇంట్లోనూ ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎంఆర్‌ఒ ఇంట్లో రూ.38 లక్షల నగదు, భారీగా ఇళ్ల స్థలాలు డాక్యుమెంట్లను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా లావణ్య భర్త, బంధువుల ఇళ్లలోనూ ఎసిబి అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. ఎంఆర్‌ఒపై సైతం చర్యలు తీసుకునేందుకు ఎసిబి అధికారులు కసరత్తు ప్రారంభించారు. కాగా లంచం తీసుకుంటూ పట్టబడ్డ విఆర్‌ఒ అంతయ్యను అరెస్టు చేసి ఎసిబి కోర్టులో హాజరుపరిచారు.

kondurg Vro Arrested By ACB Officials

Related Images:

[See image gallery at manatelangana.news]

The post విఆర్‌ఒకి రూ.4లక్షలు లంచం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: