కోయిల్‌సాగర్‌కు నేటితో 66 ఏళ్లు

50వేల ఎకరాలకు సాగుతున్న ఆయకట్టు దేవరకద్ర : జిల్లాలోని భారీ నీటి పారుదల ప్రాజెక్ట్ అయిన కోయిల్‌సాగర్‌కు నేటితో 66 ఏళ్లు పూర్తి కానున్నాయి. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ద్వారా ఎడమ కాల్వల నుంచి చిన్నచింతకుంట ధన్వాడ మండల గ్రామాలకు చెందిన దాదాపు 50వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. సాగునీటినే కాకుండా ప్రాజెక్టు నుంచి కొడంగల్, నారాయణపేట తదితర ప్రాంతాలకు ప్రజలకు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. ఇంతే కోయిలకొండ , మహబూబ్‌నగర్ మండలంలోని భూములలో […] The post కోయిల్‌సాగర్‌కు నేటితో 66 ఏళ్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

50వేల ఎకరాలకు సాగుతున్న ఆయకట్టు

దేవరకద్ర : జిల్లాలోని భారీ నీటి పారుదల ప్రాజెక్ట్ అయిన కోయిల్‌సాగర్‌కు నేటితో 66 ఏళ్లు పూర్తి కానున్నాయి. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ద్వారా ఎడమ కాల్వల నుంచి చిన్నచింతకుంట ధన్వాడ మండల గ్రామాలకు చెందిన దాదాపు 50వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. సాగునీటినే కాకుండా ప్రాజెక్టు నుంచి కొడంగల్, నారాయణపేట తదితర ప్రాంతాలకు ప్రజలకు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. ఇంతే కోయిలకొండ , మహబూబ్‌నగర్ మండలంలోని భూములలో భూగర్భ జలాలు పెరిగే రైతులు రెండు పంటలు సాగు చేసుకునేందుకు సాధ్యమవుతుంది.

కోయిల్‌సాగర్ ప్రాజెక్టు చరిత్ర

కోయిల్‌సాగర్ ప్రాజెక్టును 1954 మధ్య కాలంలో ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రాజెక్టు పనులు ప్రారంభమైన సంవత్సరం కాలం పాటు పనులు జరిగిన కొద్ది రోజుల పాటు ప్రాజెక్టు పనులు అంతరాయం ఏర్పడటంతో తిరిగి రెండు నెలల తర్వాత ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. ప్రాజెక్టు పనులు పూర్తి కావడంతో అధికారికంగా 10 /07/1954 కోయిల్‌సాగర్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కేవలం వర్షాదారంపైన ఆధారపడి కోయిల్‌సాగర్ ప్రాజెక్టును రెండు గుట్టల అనుధానం చేస్తూ ప్రాజెక్టు నిర్మించారు. ప్రాజెక్టు చుట్టూ గుట్టలు ఉండటంతో చూపరులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది. కోయిలకొండ కోట దగ్గర ప్రాజెక్టు ఉండటంతో కోయిల్‌సాగర్ అని నామకరణం చేశారు.

ప్రాజెక్టు నమ్ము నన్ను నిర్మించిన అనంతరం ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. అప్పటి నమూనా ప్రస్తుతం ఇప్పటికి కూడా ప్రాజెక్టు దగ్గర చూపరులను ఆకట్టుకుంటుంది. ప్రాజెక్టును ముందుగా 25 అడుగుల నీరు నిల్వ ఉండే విధంగా ప్రాజెక్టు ఆనకట్టను నిర్మించి తనకు ఆ సమయంలో దాదాపు వ్యయంతో పనులు పూర్తి చేశారు. 1/07/1954లో అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కెఎం ఖర్చు ప్రాజెక్టును మొట్టమొదటిసారిగా చెట్టు కింద ఉన్న ఆయకట్టుకు నీరు వదిలిపెట్టారు. 1984 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే కె. వీరారెడ్డి హయాంలో ప్రాజెక్టు నిలువ సామర్థాన్ని పెంచేందుకు గతంలో ఉన్నా అలుగుపై 5 అడుగుల ఎత్తులో అదనంగా శేఖర్‌లను ఏర్పాటు చేయడంతో ప్రాజెక్టులో మొత్తం 33 అడుగులకు చేరింది. నేటి వరకు ప్రాజెక్టుకు ఎలాంటి మరమ్మతులు చేయలేదు.

పర్యాటక కేంద్రంగా…

కోయిల్‌సాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు పాలకులు తీసుకోలేదు. ప్రాజెక్టు అయితే ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు మండల ప్రజలే కాక జిల్లాలోని నలుమూలల నుంచి ప్రతి రోజు కోయిల్‌సాగర్ ప్రాజెక్టు సందర్శించేందుకు ఉంటారు. కానీ ప్రాజెక్టు దగ్గర చెక్కుల సౌకర్యార్థం ఇలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండినప్పుడు చూసేందుకు వస్తున్నా పర్యాటకులు ఇబ్బందులకు గురవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్‌ను మార్చేందుకు ప్రణాళికను ప్రణాళికలు సిద్దం చేసింది.

లిప్ట్‌గా మారిన కోయిల్‌సాగర్

కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నో లిప్ట్‌గా అప్పటి సర్వీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2004లో రూ. 359 కోట్ల నిధులను మంజూరు చేసి జూరాల నుంచి కృష్ణా జలాలను ప్రాజెక్టులోకి తరలించేందుకు లిప్ట్ పనులను ప్రారంభించారు. పనులు ఐదేళ్లలో పూర్తి కావాల్సి ఉండగా పనులు పురోగతి కాలేదు. అదే విధగా మరోమారు పనుల నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 450 కోట్లను ప్రభుత్వం మంజూ రు చేసి భారీ నీటి శాఖ మంత్రి హరీష్‌రావు పెండింగ్‌లో ఉన్న లిప్ట్ పనులు కాల్వ పనులు పూర్తి చేసి కోయిల్‌సాగర్ ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేశారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకి జూరాల ప్రాజెక్టు వాటర్ నుంచి నీరు వస్తుంది. ఆయా మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు తాగుసాగు నీటి సమస్య తీరింది.

గొలుసుకట్టు చెరువులకు నిధులు మంజూరు

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మండలంలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టు మండలంలోని గద్దెగూడెం వెంకటపల్లి దేవరకద్ర చౌదర్‌పల్లి , లక్షంపల్లి , పుట్టపల్లి , కౌకుంట్ల , పేరూర్ తదితర గ్రామాలకు గొలుసుకట్టు చెరువుల నుంచి నీరు అందుతుంది. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర 22 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడంతో ఆయా గ్రామాల చెరువులకు తీసుకొచ్చేందుకు కాల్వ పనులు ప్రారంభించారు.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post కోయిల్‌సాగర్‌కు నేటితో 66 ఏళ్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: