కోడి గద్దల వైరం

  ఒక అడవిలో అనేక పక్షులతోపాటు, ఒక కోడి కూ డా నివసిస్తుంది. వేల ఏళ్ల క్రితం, కోడి కూడా ఇతర పక్షుల మాదిరిగా గాలిలోనే ఎగిరి వెళ్లేదట! ఒక రో జు ఆహారం కోసం చాలా దూరం ఎగిరి వెళ్లింది. దొ రికిన గింజలు, క్రిమికీటకాలను తిని తిరిగి తన గూ డుకు బయలుదేరింది. ఇంతలో హఠాత్తుగా దానికి ఒక గద్ద ఎదురైంది. అది చాలా ఆకలితో ఉంది. కోడిని చంపి తినాలని గద్ద దానిని […] The post కోడి గద్దల వైరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఒక అడవిలో అనేక పక్షులతోపాటు, ఒక కోడి కూ డా నివసిస్తుంది. వేల ఏళ్ల క్రితం, కోడి కూడా ఇతర పక్షుల మాదిరిగా గాలిలోనే ఎగిరి వెళ్లేదట! ఒక రో జు ఆహారం కోసం చాలా దూరం ఎగిరి వెళ్లింది. దొ రికిన గింజలు, క్రిమికీటకాలను తిని తిరిగి తన గూ డుకు బయలుదేరింది. ఇంతలో హఠాత్తుగా దానికి ఒక గద్ద ఎదురైంది. అది చాలా ఆకలితో ఉంది. కోడిని చంపి తినాలని గద్ద దానిని వెంబడించసాగింది. కోడి బారిన పడకుండా చాలా దూరం ప్రయాణించింది. అయినా గద్ద తన ప్రయత్నాన్ని మానలేదు. కోడి అలసిపోయింది. “నాలో శక్తి సన్నగిల్లుతుంది. ఇంకెంత మాత్రం గద్దను తప్పించుకోలేను. దానికి ఆహారం కాక తప్పదు” అని లోలోన అనుకుంది. ఇంతలో భూమి మీదకు చూసింది. కోడికి సమీపంలో ఒక కుటీరం కనపడింది. దాని ముందు ఒక స్వామిజీ ధ్యాన ముద్రలో కనిపించాడు. వెంటనే స్వామిజీ ముందు వాలింది కోడి.

“స్వామిజీ… స్వామిజీ… నన్ను ఈ గద్ద నుంచి ఎలాగైన కాపాడండి”, అని దీనంగా వేడుకుంది. కళ్లు తెరిచాడు ముందు ప్రాణ భయంతో కోడి, దాని వెనుక గద్ద కనిపించింది. పరిస్థితిని అర్ధం చేసుకున్న స్వామిజీ కోడిని రక్షించి గద్దను తరిమికొట్టాడు. ప్రాణాలు కాపాడిన స్వామిజీకి కృతజ్ఞతలు చెప్పింది కోడి.

కోడిని చూసి జాలి పడిన స్వామిజీ, “నీవు పూర్తిగా అలసిపోయినట్టున్నావు. పైగా శరీరానికి గాయాలు అయినట్టుగా కనిపిస్తుంది. ఈ స్థితిలో నీవు వెళ్లడం క్షేమం కాదు. నీకు నచ్చితే నా కుటీరంలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకో. ఆరోగ్యం మెరుగైన తర్వాత నీవు వెళ్ళవచ్చు”నని కోడితో అన్నాడు.

కోడి సరేనంది. కుటీరంలో స్వామిజీతో ఉండసాగింది. స్వామిజీ చల్లిన గింజలు తింటూ చుట్టూ ఉండే చిన్నచిన్న క్రిమికీటకాలను ఆహారంగా తీసుకునేది. రాత్రిళ్ళు కుటీరంలో ఒక మూల న నిద్రి ంచేది.

పైగా స్వామిజీ కోడిని కంటికి రెప్పలా చూసుకునేవాడు. అడవి జంతువుల బారి నుంచి కాపాడేవాడు. ఇలా పూర్తి రక్షణ కల్పించాడు కోడికి. దాంతో కోడి హాయిగా ఎలాంటి భయం లేకుండా జీవించసాగింది. అనతి కాలంలోనే కోడి పూర్తిగా కోలుకుంది.

“నేను ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. ఎలాగైనా వెళాలి” అని అనుకుంది. చాలా రోజులైంది గాలిలోకి ఎగరక అని అనుకుంటూ గాలిలోకి లేచింది. కొంచెం దూరం వెళ్లింది. బాగా పైకెగరడానికి ప్రయత్నించింది. కాని వెళ్ళలేకపోయింది. చివరకు నేలపై వాలింది. ఎందుకిలా జరిగింది? త్వరగా అలసిపోయాను కారణం ఏమైవుంటుందని ఆలోచిస్తూ కుటీరంవైపు పరుగుపెట్టింది కోడి.

మళ్ళీ కొన్ని రోజులు గడిచింది. కోడికి ఎలాంటి శ్రమ లేకుండా ఆహారం దొరుకుతుంది. పైగా ఆహారం కోసం దూరం వెళ్ళాల్సిన శ్రమ తప్పింది. ఇతర జంతువుల భయం తగ్గింది. కోడి హాయిగా, చీకూ చింతా లేకుండా జీవిస్తుంది. దీంతో కోడి బ రువు పెరగనారంభించింది.

మళీ వెళ్ళాలనుకొని పైకెగిరింది. కానీ పెరిగిన బరువు వల్ల బాగా పైకి ఎగరలేకపోయింది. రెక్కలు గతంలో మాదిరిగా వేగంగా కదిలించలేకపోయింది. “ఇలా అయితే నేను గద్దకో, జంతువులకో ఆహారం కాక తప్పదు, శాశ్వతంగా స్వామిజీతో ఉండిపోవడమే మేలు” అని అనుకుంది కోడి.

నెలల తరబడి స్వామిజీ వద్ద ఉండడం వల్ల స్వామిజీతో అనుబంధం పెరిగింది. అడవుల్లో నివసించడం కన్నా మానవ సమూహలతో కలిసి ఉండడం క్షేమం అని భావించింది. పైగా స్వామిజీ తనతో ఉండడానికి ఏ అభ్యంతరం చెప్పలేదు.
ఇలా ఏళ్ళు, తరాలు గడిచాయి. కోడి పైకెగిరే అవసరం లేకపోవడం వల్ల పరిణామ క్రమంలో కోడి జాతి మెల్లమెల్లగా ఆకాశం పైకి ఎగిరే సామర్ధం కోల్పోయిందట. ఇలా కోడి మానవ జాతికి మచ్చికైందట. అప్పటి నుంచి మానవ సమూహాలతో నివసిస్తూ ఎందరికో పౌష్టికాహారాన్ని అందిస్తుంది.

అయితే గద్ద మాత్రం ఆనాడు తప్పించుకున్న కోడిని మాత్రం మరిచిపోలేకపోతుంది. ఇప్పటికి కోడి, దాని పిల్లలు కనపడ్డ ప్రతిసారి దాడిచేస్తుంది. ఇలా వైరం ఇంకా కొనసాగుతునే ఉంది.

Kodi Story in Telugu

పుల్లూరు జగదీశ్వరరావు

94415 38797

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కోడి గద్దల వైరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.