అవిశెగింజలతో కీళ్లనొప్పులు మాయం

Flax Seeds

 

కీళ్ల నొప్పుల బాధలను వర్ణించలేం. మోకాళ్లనొప్పులు, దీర్ఘకాలిక కీళ్ల నొప్పులతో పెద్దవాళ్లు తరచూ బాధపడుతుంటారు. ఈ నొప్పులను నివారించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలో చెబుతున్నారు నిపుణులు. హార్మోన్లలో తలెత్తే తేడాల వల్ల మంట, ఒళ్లు నొప్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి బాధలు తలెత్తుతాయి. పోషకాహారలోపం వల్ల కూడా ఈ రకమైన నొప్పుల బారిన పడతాం. ఎలర్జిక్ రియాక్షన్స్ వల్ల కూడా నొప్పులు వస్తుంటాయి. -హార్మోన్లలో తేడాలు లేకుండా చూసుకోవాలి.

ముఖ్యంగా ప్రీ -మెనోపాజ్ దశలో మహిళల్లో ఈ రకమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటప్పుడు తప్పనిసరిగా సమతులాహారం తీసుకోవాలి. అంతేకాదు వ్యాయామాలు, ధ్యానం వంటివి తప్పనిసరిగా చేయాలి. -పళ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల అవి యాంటి ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్లుగా పనిచేస్తాయి. అందుకే ఇవి డైట్‌లో తప్పనిసరిగా ఉండేట్టు చూసుకోవాలి. – మల్టీవిటమిన్ సప్లిమెంట్లను మూడు నెలల పాటు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని పోషకాహారలోపం సర్దుకుంటుంది. -స్వీట్లు, బిస్కట్లు, మైదా లాంటి రిఫైన్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.

చిరు ధాన్యాల్లాంటివి తింటే శరీరంలోకి పీచుపదార్థం చేరుతుంది. -మనం తీసుకునే ఆహారపదార్థాల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకే వారానికి కనీసం మూడుసార్లు చేపలను తినాలి. లేదా మూడు నెలల పాటు సప్లిమెంట్ థెరపీ తీసుకోవాలి. వాల్‌నట్స్, అవిశలు వంటి వాటిల్లో ఓమేగా ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉంటాయి. -బాగా ఒత్తిడికి గురవడం వల్ల శరీరంలో కోర్టిసాల్ అనే హార్మోన్ విడుదలువుతుంది. అది ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీస్తుంది. అందుకే ఒత్తిడిని అధిగమించడానికి రోజూ వ్యాయామాలు చేయాలి. ఐదు వాల్‌నట్లు, రెండు పెద్ద పైనాపిల్ ముక్కలు, అల్లం కొద్దిగా, అరకప్పు పెరుగు, నీళ్లు అన్నీ కలిపి తయారుచేసిన యాంటి ఇన్‌ఫ్లమేటరీ డ్రింకును ఒళ్లు నొప్పులు తగ్గేదాకా రోజూ తాగాలి.

ఆస్టియో ఆర్థరైటిస్: కార్టిలేజ్ బాగా దెబ్బతినడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయి. కీళ్లు బిగదీసుకుపోతాయి. కాళ్లను కదల్చలేరు. వయసు పైబడ్డ వాళ్లల్లోనే ఈ సమస్య ఉండదు. జన్యు సంబంధమైన కారణాల వల్ల కూడా ఈ తరహా నొప్పులు తలెత్తుతుంటాయి. కదిలితే ఎక్కడ నొప్పులు వస్తాయోనని చాలామంది కదలకుండా అలాగే కూర్చుంటారు. ఫలితంగా ఊబకాయం వస్తుంది. యాంటి ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ ఎక్కువ కాలం ఉపయోగిస్తే పొట్టకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. శరీర బరువు తగ్గాలి. బరువు తగ్గితే నొప్పులు కూడా వాటంతట అవే తగ్గుతాయి. -కార్టిలేజ్ ఆరోగ్యంగా ఉండడానికి పోషకపదార్థాలు తీసుకోవాలి.

విటమిన్ -సి ఎక్కువగా తీసుకుంటే మంచిది. డైట్‌లో ఎక్కువ సిట్రస్ పళ్లు ఉండేట్టు చూసుకోవాలి. లేదా మూడు నెలలపాటు 1000 మిల్లీ గ్రాములు మించకుండా విటమిన్ సప్లిమెంట్ తీసుకోవాలి. సప్లిమెంట్లతోపాటు రోజూ పండ్లను తినాలి. విటమిన్- డి వల్ల ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. సూర్యరశ్మి తగలడం వల్ల చర్మానికి కావాల్సిన డి విటమిన్ అందుతుంది. తెల్ల సొన, చేప, పాలు బాగా తీసుకోవాలి. కార్టిలేజ్ బలిష్టంగా ఉండడానికి విటమిన్ -ఇ సహాయపడుతుంది. నట్స్, గింజలు, ఆకుకూరలు, కూరగాయలు, నూనెల్లో విటమిన్ -ఇ పుష్కలంగా ఉంటుంది.

అల్లం తినడం మంచిది. అలా చేస్తే కీళ్ల బాధతోపాటు వాపు కూడా తగ్గుతుంది. కాల్షియం, ఫోస్ఫరస్‌లను బాగా తీసుకోవాలి.
ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. షెల్ ఫిష్, పాలలో ఈ న్యూట్రియంట్స్ బాగా ఉంటాయి. ఓమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎముకలను బలంగా ఉంచుతాయి. హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి. ఇలా పోషకాహారం తినడంతోపాటు తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల జబ్బులకు దూరంగా ఉండచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు.

Knee pain natural treatment with Flax Seeds

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అవిశెగింజలతో కీళ్లనొప్పులు మాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.