రిలయన్స్ జియోలో మరో కంపెనీ పెట్టుబడి

  రూ.11,367 కోట్లు పెట్టుబడి పెట్టనున్న కెకెఆర్ న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ ఈక్విటీ దిగ్గజం కెకెఆర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆర్‌ఐఎల్ శుక్రవారం ప్రకటించింది. తమ మధ్య రూ.11,367 కోట్ల మేరకు ఒప్పందం కుదిరినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు జియో ప్లాట్‌ఫామ్స్‌లో 2.32 శాతం వాటాను కెకెఆర్‌కు బదలాయించనున్నట్లు తెలిపింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్‌బుక్, సిల్వర్‌లేక్, విస్టాఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్ అట్లాంటిక్ […] The post రిలయన్స్ జియోలో మరో కంపెనీ పెట్టుబడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రూ.11,367 కోట్లు పెట్టుబడి పెట్టనున్న కెకెఆర్

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ ఈక్విటీ దిగ్గజం కెకెఆర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆర్‌ఐఎల్ శుక్రవారం ప్రకటించింది.

తమ మధ్య రూ.11,367 కోట్ల మేరకు ఒప్పందం కుదిరినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు జియో ప్లాట్‌ఫామ్స్‌లో 2.32 శాతం వాటాను కెకెఆర్‌కు బదలాయించనున్నట్లు తెలిపింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్‌బుక్, సిల్వర్‌లేక్, విస్టాఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్ అట్లాంటిక్ తర్వాత జియోలో కెకెఆర్ కూడా వాటాదారుగా మారింది. ఆసియాలో కెకెఆర్‌కు ఇదే అతిపెద్ద పెట్టుబడి కావడం గమనార్హం. ఈ పెట్టుబడితో జియో ప్లాట్‌ఫామ్స్ ఈక్విటీ విలువ రూ. 4.91 లక్షల కోట్లకు చేరింది.

ఇప్పటివరకు జియోలో వివిధ కంపెనీలు పెట్టిన పెట్టుబడుల విలువ రూ.78,562 కోట్లకు చేరింది. కెకెఆర్‌ను 1976లో స్థాపించారు.అంతర్జాతీయ స్థాయి ఎంటర్‌ప్రైజెస్‌ను నెలకొల్పడం, సాంకేతిక రంగంలోని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడంలో ఈ సంస్థకు విశేష అనుభవం ఉంది. ఇప్పటికే ఈ సంస్థ 30కి పైగా వివిధ కంపెనీల్లో 30 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. భారత్‌లోను ఈ సంస్థ 2006నుంచి తన పెట్టుబడుల ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.

KKR will invest Rs 11,367 crore in Jio Platforms

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రిలయన్స్ జియోలో మరో కంపెనీ పెట్టుబడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: