ప్రైవేట్ ఆస్పత్రుల్లో వసూళ్లకు పాల్పుడుతున్నారు: కిషన్ రెడ్డి

హైదరాబాద్: గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… త్వరలో ఇఎస్ఐ ఆస్పత్రిలో కోవిడ్ పడకలు ఏర్పాటు చేస్తామన్నారు. టిమ్స్ లో వెయ్యిమందికి చికిత్స అందించేలా సిబ్బందిని తీసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 1,200 వెంటిలేటర్లు పంపిందని చెప్పారు. టిమ్స్ ను మరింత అభివృద్ధి చేసి సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. టిమ్స్ లో పూర్తి స్థాయిలో సిబ్బందిని భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో […] The post ప్రైవేట్ ఆస్పత్రుల్లో వసూళ్లకు పాల్పుడుతున్నారు: కిషన్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… త్వరలో ఇఎస్ఐ ఆస్పత్రిలో కోవిడ్ పడకలు ఏర్పాటు చేస్తామన్నారు. టిమ్స్ లో వెయ్యిమందికి చికిత్స అందించేలా సిబ్బందిని తీసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 1,200 వెంటిలేటర్లు పంపిందని చెప్పారు. టిమ్స్ ను మరింత అభివృద్ధి చేసి సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు.

టిమ్స్ లో పూర్తి స్థాయిలో సిబ్బందిని భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వసూళ్లకు పాల్పుడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పుకొచ్చారు. కేంద్రం తెలంగాణకు అన్ని రకాలుగా సహకరిస్తోందన్నారు. ఆగస్టు నెలంతా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. ట్రేసింగ్ టెస్టింగ్ ట్రీటింగ్ ద్వారా కోవిడ్ ను అరికడుదామన్నారు. పరీక్షలు సంఖ్య ఎంత పెంచింతే అంత కరోనాను అరికట్టవచ్చన్న కేంద్రమంత్రి… హైదరాబాద్ లోని అన్ని బస్తీలో పరీక్షలు నిర్వహించలని చెప్పారు.

Minister Kishan Reddy visited Gachibowli Tims Hospital

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ప్రైవేట్ ఆస్పత్రుల్లో వసూళ్లకు పాల్పుడుతున్నారు: కిషన్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: