తాటాకుచప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డి

Kishan-reddyహైదరాబాద్: ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్- పాకిస్తాన్ ల నడుమ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధానితో ఇమ్రాన్ ఖాన్ తో పాటు, మంత్రులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… యుద్దమంటూ వస్తే పాకిస్థాన్ ను ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తామని హెచ్చరించారు. పాక్ ప్రధాని ముచ్చట్లుకు భయపడే ప్రసక్తే లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాకినాడ జేఎన్టీయూలో ఆర్టికల్ 370 మీద జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 కారణంగా మహిళా రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లు, ఉద్యోగ రిజర్వేషన్లు ఉండవన్నారు. ప్రధాని మోడీ కాశ్మీర్ పై ధైర్యంగా ముందడుగు వేసి ఆర్టికల్ 370ని రద్దు చేశారని ప్రశంసలు కురిపించారు. దేశం కోసం ఏ త్యాగానికైనా తాను సిద్ధమన్నారు కిషన్ రెడ్డి.

Kishan Reddy Comments on Pakistan

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తాటాకుచప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.