మోడీకి ‘కింగ్ హమద్’ అవార్డు

PM Narendra Modiఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోడీకి బహ్రెయిన్ సర్కారు ‘కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ రినైసెన్స్’ను ప్రదానం చేసింది. బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఈ అవార్డును మోడీకి ప్రదానం చేశారు. శనివారం యుఎఇ ప్రభుత్వం మోడీకి తమ దేశపు అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జయాద్’ను అందించిన విషయం తెలిసిందే. బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఖలీపాతో మోడీ పలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ క్రమంలో అంతరిక్ష రంగం, సౌరశక్తి, సాంస్కృతిక రంగాల్లో కలిసి పని చేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. ‘కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ రినైసెన్స్ అవార్డు రావడంపై ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశారు.  భారత్-బహ్రెయిన్ ల మధ్య బలమైన స్నేహానికి ఈ అవార్డే నిదర్శనమని మోడీ పేర్కొన్నారు. బహ్రెయిన్ తో భారత్ కు వందల ఏళ్ల నుంచే సత్సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పారు. బహ్రెయిన్ లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోడీ కావడం గమనార్హం.

King Hamad Award To PM Narendra Modi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మోడీకి ‘కింగ్ హమద్’ అవార్డు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.