నా నోరు మూసేయకండి

  హంతకులను వేడుకున్న సౌదీ జర్నలిస్టు ఖషోగీ ఆయన చివరి సంభాషణను బయట పెట్టిన టర్కీ పత్రిక అంకారా: తాను ఆస్తమాతో బాధపడుతున్నానని, ఊపిరాడకుండా తన నోటిని మూసి వేయవద్దని హత్యకు గురయిన సౌదీ జర్నలిస్టు జమాల్ ఖషోగి తనను హత్య చేసిన కిరాయి ముఠాను చివరి సారిగా వేడుకున్నట్లు టరీకి చెందిన ‘సబా’ అనే పత్రిక వెల్లడించింది. 2018 అక్టోబర్ 2న ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయంలోకి వెళ్లిన ఖషోగిని సౌదీ ప్రభుత్వం పంపి న […] The post నా నోరు మూసేయకండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హంతకులను వేడుకున్న సౌదీ జర్నలిస్టు ఖషోగీ
ఆయన చివరి సంభాషణను బయట పెట్టిన టర్కీ పత్రిక

అంకారా: తాను ఆస్తమాతో బాధపడుతున్నానని, ఊపిరాడకుండా తన నోటిని మూసి వేయవద్దని హత్యకు గురయిన సౌదీ జర్నలిస్టు జమాల్ ఖషోగి తనను హత్య చేసిన కిరాయి ముఠాను చివరి సారిగా వేడుకున్నట్లు టరీకి చెందిన ‘సబా’ అనే పత్రిక వెల్లడించింది. 2018 అక్టోబర్ 2న ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయంలోకి వెళ్లిన ఖషోగిని సౌదీ ప్రభుత్వం పంపి న కిరాయి హంతక ముఠా హత్య చేసి మాయం చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ హత్య ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తనను హత్య చేయడానికి పంపిన ముఠా సభ్యులతో ఖషోగి జరిపిన సంభాషణ రికార్డింగ్ వివరాలను టర్కీ ప్రభుత్వానికి సన్నిహితమైనదిగా భావిస్తున్న ఈ పత్రిక బుధవారం ప్రచురించింది. ఆ పత్రిక ప్రచురించిన ఈ సంభాషణ వివరాల ప్రకారం… ‘మీకు వ్యతిరేకంగా ఇంటర్‌పోల్ ఆదేశాలు ఉన్నందున మిమ్మల్ని తిరిగి సౌదీకి తీసుకెళ్తున్నాం’ అని సౌదీ ముఠా సభ్యుల్లో ఒకరైన మహెర్ ముత్రెబ్ ఖషోగీతో చెప్పాడు.

అయితే తనపై ఎలాంటి లీగల్ కేసు లేదని, బయట తన ప్రియురాలు వేచి ఉందంటూ తనను రియాద్ తీసుకెళ్లడానికి ఖషోగి అభ్యంతరం చెప్పారు. అంతేకాదు, తన గురించి ఆందోళన చెందవద్దంటూ తన కుమారుడికి ఒక మెస్సేజి పంపించాలంటూ ముత్రజ్ , ముఠాలోని మరొకతను ఖషోగిని బలవంతం చేయడం కూడా ఆ సంభాషణల్లో వినిపించింది. అయితే ‘నేను ఎలాంటి మెస్సేజి రాయను’ అంటూ ఖషోగి ప్రతిఘటించారు. అయితే ‘నువ్వు మాకు సహకరిస్తే మేము మీకు సాయం చేస్తాం. ఎందుకంటే చివరగా మేము నిన్ను సౌదీ అరేబియాకు తీసుకెళ్లడం ఖాయం,. నువ్వు మాకు సహకరించకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు’ అని ముర్తెబ్ ఆ తర్వాత ఖషోగితో అన్నాడు. హంతకులు ఖషోగికి మత్తు మందు ఇచ్చి, అతను స్పృహ కోల్పోయేలా చేయడానికి ముందు ఆయన మాట్లాడిన చివరి మాటలను కూడా ‘సబా’ పత్రిక ప్రచురించిందిప్రచురించింది.

Khashoggi asked killers not to suffocate him in final words

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నా నోరు మూసేయకండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: