ప్రారంభమైన ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర

 

హైదరాబాద్: వినాయక నిమజ్జనం సందర్భంగా ఖైరతాబాద్ శ్రీద్వాదశాదిత్య మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది.  భారీ క్రేన్‌ సాయంతో ట్రక్కుపైకి విగ్రహాన్ని ఎక్కించారు. గణపతి శోభాయాత్ర ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు.  ఎన్టీఆర్ మార్గ్‌లో ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర కొనసాగనుంది. మహాగణపతిని మధ్యహ్నం 1గంటలోపే నిమజ్జనం చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. హుస్సేన్ సాగర్లో మహా గణపతిని సంపూర్ణంగా నిమజ్జనం చేసేందుకు క్రేన్ నెంబర్ 6 దగ్గర 20 ఫీట్లకు పైగా లోతు పెంచినట్లు జిహెచ్‌ఎంసి తెలిపింది. ఎలాంటి అవరోధాలూ లేకుండా నిమజ్జనం జరిగేందుకు అన్నీ ఏర్పాట్లు చేశారు.  ఉదయం 6 గంటల నుంచే హుస్సేన్ సాగర్ వద్ద గణనాథుల రాకతో సందడి నెలకుంది. అయితే పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. అయినప్పటికీ వర్షం మధ్యే విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. కాగా, ఈ రోజు ఉదయం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు గణేష్ నిమజ్జనం కొనసాగనున్న నేపథ్యంలో నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Khairatabad Ganesh shobha Yatra Started

The post ప్రారంభమైన ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.