కొత్త పురపాలక చట్టంలో ‘కీ’రూల్స్…

  కమిషనర్‌పై కలెక్టర్ నిఘా, బాధ్యతా రహిత అధికారులపై వేటు, కౌన్సిలర్లను సస్పెండ్ చేసే అధికారం మెదక్  : పురపాలక చట్టం 2019 రాష్ట్ర ప్రభుత్వం గురువారం శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సమగ్ర నివేదికను ప్రవేశపెట్టారు. ఇప్పటికే మున్సిపల్ నూతన ముసాయిదాను మంత్రిమండలి ఆమోదించిన విషయం విధితమే. శాసనసభలో నూతన చట్టాన్ని ప్రవేశపెట్టిన కొత్త చట్టంలో అధికారులతోపాటు కౌన్సిలర్లు కూడా పూర్తిస్థాయి జవాబుదారిగా ఉండాలని పేర్కొంది. చట్టం పరిధిలో కలెక్టర్‌కు బాధ్యతలను అప్పగించారు. ఇకపై మున్సిపల్ కమిషనర్లు […] The post కొత్త పురపాలక చట్టంలో ‘కీ’రూల్స్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కమిషనర్‌పై కలెక్టర్ నిఘా, బాధ్యతా రహిత అధికారులపై వేటు, కౌన్సిలర్లను సస్పెండ్ చేసే అధికారం

మెదక్  : పురపాలక చట్టం 2019 రాష్ట్ర ప్రభుత్వం గురువారం శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సమగ్ర నివేదికను ప్రవేశపెట్టారు. ఇప్పటికే మున్సిపల్ నూతన ముసాయిదాను మంత్రిమండలి ఆమోదించిన విషయం విధితమే. శాసనసభలో నూతన చట్టాన్ని ప్రవేశపెట్టిన కొత్త చట్టంలో అధికారులతోపాటు కౌన్సిలర్లు కూడా పూర్తిస్థాయి జవాబుదారిగా ఉండాలని పేర్కొంది. చట్టం పరిధిలో కలెక్టర్‌కు బాధ్యతలను అప్పగించారు. ఇకపై మున్సిపల్ కమిషనర్లు కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేయాల్సి ఉంటుంది. గతంలో మున్సిపల్ కౌన్సిల్ పరిధిలోనే లేఅవుట్లు విడుదల చేస్తుండగా కొత్త చట్టంలో కలెక్టర్ అధ్యక్షతన లేఆవుట్ కమిటీ ఉండబోతుంది.

టౌన్ ప్లానింగ్‌లో కూడా ఎక్కువశాతం కలెక్టర్‌లకే బాధ్యతలను కట్టబెట్టారు. భవన నిర్మాణ అనుమతుల కోసం పూర్తిస్థాయి దస్త్రాలు సమర్పించినప్పటికీ ఆన్‌లైన్ ఇబ్బందులు తప్పడం లేదు. ఇందుకు పరిష్కార మార్గంగా టీఎస్‌ఐపాస్ తరహాలో దరఖాస్తు సమయంలో అన్ని దరఖాస్తులు సరిగ్గా ఉంటే నిర్ణీత గడువులోగా భవన నిర్మాణ అనుమతులు ఇవ్వబోతున్నారు. గడువులోగా సమాచారం రాకపోతే అనుమతి వచ్చినట్లుగా భావించవచ్చు. గతంలో పనిచేయని అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉండేది. కానీ నూతన చట్టంలో అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు విధి నిర్వహణలో బాధ్యతరహితంగా పనిచేస్తే సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్‌కుకల్పించారు. పట్టణంలో పచ్చదనానికి పెద్ద పీట వేస్తూ బడ్జెట్‌లో పదిశాతం నిధులు కేటాయించాలని ఆదేశించారు.

కేటాయించిన నిధుల్లో 85శాతం కంటే తక్కువ వినియోగిస్తే కౌన్సిలర్, ప్రత్యేకాధికారులపై చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా పదవినుంచి తొలగించే అధికారం కలెక్టర్లకు కల్పించారు. మున్సిపాలిటీల ఆర్థికాభివృద్ధ్దికి ప్ర భుత్వం కూడా సహాయంచేయనున్నట్లు ప్రకటించారు. నిధులసమీకరణకు మున్సిపాలిటీలకు బాండ్లు జారీ చేసే అధికారాన్ని కల్పించారు. మున్సిపాలిటీలకు మా స్టర్‌ప్లాన్, తాగునీటిపథకం, భూగర్భ మురుగునీరు, పారుశుద్ధవ్యవస్థ, ఆస్తిపన్ను సంస్కరణ, భూసేకరణకు ల్యాండ్ పూలింగ్ విధానం అమలు చేయడానికి వెసులుబాటు కల్పించారు.

ఉత్తమ మున్సిపాలిటీ ఎంపికకు రేటింగ్ విధానం అమలు చేయబోతున్నారు. నూతన చట్టంలో కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించడంతో కిందిస్థాయి అధికారులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. తమ పరిధిలోని పనులుపూర్తిచేసి కలెక్టర్‌కు విన్నవించే అవకాశం కల్పించడంతో ఒత్తిడి తగ్గుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా అధికారి పర్యవేక్షణలో మున్సిపాలిటీల్లో బాధ్యత మరింత పెరిగే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైన పురపాలక చట్టంలో పట్టణ ప్రజలు సమస్యలు ఎలా తీరుతాయోననే ప్రధాన ఆశతో ఎదురుచూస్తున్నారు.

Key Rules in New Municipal Law

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కొత్త పురపాలక చట్టంలో ‘కీ’రూల్స్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: