స్నేహితుడి భార్యపై కిరోసిన్ పోసి….

  రంగారెడ్డి: తన భార్యపై స్నేహితుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడని  పోలీసులకు ఆమె భర్త ఫిర్యాదు చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా పహాడీ షరీఫ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నరసింహ, మమత అనే దంపతులు జియాగూడలో నివసిస్తున్నారు. నరసింహ స్నేహితుడు మమతపై కన్నేశాడు. ఆమె ఎంతకు లొంగకపోయేసరికి ఆమెను తీవ్రంగా గాయపరచాలని నిర్ణయం తీసుకున్నాడు. మమత జల్‌పల్లిలోని శ్రీరామకాలనీలో ఉండే అమ్మగారింటికి వెళ్లింది. ఇంట్లో ఎవరు లేనిది చూసిన నరసింహ స్నేహితుడు ఇంట్లోకి చొరబడి […] The post స్నేహితుడి భార్యపై కిరోసిన్ పోసి…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రంగారెడ్డి: తన భార్యపై స్నేహితుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడని  పోలీసులకు ఆమె భర్త ఫిర్యాదు చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా పహాడీ షరీఫ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నరసింహ, మమత అనే దంపతులు జియాగూడలో నివసిస్తున్నారు. నరసింహ స్నేహితుడు మమతపై కన్నేశాడు. ఆమె ఎంతకు లొంగకపోయేసరికి ఆమెను తీవ్రంగా గాయపరచాలని నిర్ణయం తీసుకున్నాడు. మమత జల్‌పల్లిలోని శ్రీరామకాలనీలో ఉండే అమ్మగారింటికి వెళ్లింది. ఇంట్లో ఎవరు లేనిది చూసిన నరసింహ స్నేహితుడు ఇంట్లోకి చొరబడి తనతో కలిసి ఉండాలని బలవంతపెట్టాడు. దీంతో నిందితుడితో బాధితురాలు గొడవకు దిగింది. నిందితుడి ప్లాన్ చేసుకున్న ప్రకారం ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి వెళ్లిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. 70 శాతం గాయాలతో ఉన్న ఆమె నుంచి మెజిస్ట్రేట్ వాంగ్మూలం తీసుకున్నారు. ఆస్పతి తీసుకెళ్లేటప్పుడు ఇది అగ్నిప్రమాదమేనని స్థానిక ఎస్‌ఐ శంకర్‌కు తెలిపింది. ఇది అగ్ని ప్రమాదం కాదని, తన ఇద్దరు పిల్లలు, బాధితురాలి చెల్లెలు సాక్ష్యమని నరసింహ పోలీసులకు తెలిపాడు. పిల్లలతో ఫిర్యాదు చేయిస్తే నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తామని వెల్లడించారు.

 

Kerosene Pour on Friend Wife in Rangareddy

The post స్నేహితుడి భార్యపై కిరోసిన్ పోసి…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: